కెసిఆర్‌కు నితీష్ కుమార్ ఫోన్, చంద్రబాబుకు అందని ఆహ్వానం!
పాట్నా/హైదరాబాద్: బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ శుక్రవారం రెండు గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన ప్రమాణ స్వీకారానికి నితీష్ పలువురిని ఆహ్వానించారు. ప్రధాని మోడీ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం అందలేదని వార్తలు వస్తున్నాయి.
బీహార్ ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని తెలంగాణ సీఎం కెసిఆర్‌ను నితీశ్ కుమార్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారని తెలుస్తోంది. వారిద్దరు అర్ధగంటకు పైగా మాట్లాడినట్లు సమాచారం.

బీహార్ ఎన్నికల ఫలితాలు విడుదలయిప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కెసిఆర్... నితీష్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. ఆ సమయంలో నితీష్ విలేకరులతో మాట్లాడుతూ... తనకు ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు ఫోన్ చేసి అభినందనలు తెలిపారని చెప్పారు.
బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ మూడోసారి శుక్రవారం ప్రమాణం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల నేతలను నితీశ్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications