కెసిఆర్‌తో టిడిపి కుమ్మక్కు: రోజా, రాజయ్య పాయింట్ లాగిన రేవంత్ రెడ్డి
వరంగల్/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా శనివారం నాడు వరంగల్ లోకసభ ఎన్నికల ప్రచారంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసుల నేపథ్యంలో టిఆర్ఎస్ - టిడిపిలు ఒక్కటయ్యాయని ఆరోపించారు.
ఓటుకు నోటు కేసులో తమను కాపాడుకునేందుకు టిడిపి నేతలు టిఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యారని విమర్శించారు. మరోవైపు, ఎన్డీయే (బిజెపి-టిడిపి) అభ్యర్థి దేవయ్యను ఓడించేందుకు టిఆర్ఎస్ - వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటయ్యాయని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.
వరంగల్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థికి లబ్ధి చేకూర్చేందుకే వైసిపి తమ అభ్యర్థిని బరిలోకి దింపిందని ఆరోపిస్తున్నారు.

రాజయ్య పాయింట్ లాగిన రేవంత్ రెడ్డి
రాజయ్య ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తే వేదిక పైనే రాజయ్యను అవమానించిన ఘనత సిఎం కెసిఆర్‌ది అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కానీ ఇప్పుడు ఎన్నికలు ఉండటంతో అక్కడి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయా్నని తెరపైకి తెచ్చారన్నారు.
వరంగల్‌కే చెందిన వైద్యుడిని వీసీగా నియమించడం వెనుక ఉప ఎన్నికలే కారణమని అభిప్రాయపడ్డారు. గత పద్దెనిమిది నెలల నుంచి తీసుకోని నిర్ణయాలను, ప్రకటనలను కేవలం వరంగల్ ఎన్నికలను పురస్కరించుకొని ఇప్పుడు కెసిఆర్ ప్రకటిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రకటన, నిరుద్యోగులను ఆకట్టుకునేందుకే వయోపరిమితి మూడేళ్ల సడలింపు, టెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల వంటివన్నీ ఉప ఎన్నికల నేపథ్యంలోనే అన్నారు. ఇవి ఓటర్లను ప్రభావితం చేసేందుకేనని, ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications