కేసీఆర్! నీ ఫాంహౌస్ ఇవ్వు: ఓయు మెరుపు ధర్నా

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు సోమవారం నాడు సచివాలయంలో మెరుపు ధర్నాకు దిగారు. ఓయు భూములను ఇళ్లకు కేటాయించవద్దని వారు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.

ఓయు కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్‌యూఐ, విద్యార్థి ఐకాస నేతలు సోమవారం సాయంత్రం తెలంగాణ సచివాలయంలో మెరుపు ధర్నా నిర్వహించారు. వారు హఠాత్తుగా సీఎం కార్యాలయం ముందుకు దూసుకు వచ్చారు. కాంగ్రెస్ పతకాలను, ప్లకార్డులను చేతబట్టి నినాదాలు చేశారు.

 ఓయు విద్యార్థులు

ఓయు విద్యార్థులు

ఉస్మానియా యూనివర్సిటీ భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని స్వచ్ఛ హైదరాబాద్‌‌లో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని నిరసిస్తూ ఓయూ విద్యార్థి జేఏసీ, ఎన్‌ఎస్‌యూఐ నేతలు సచివాలయంలోని సీఎం కార్యాలయం సీబ్లాక్‌ ప్రాంగణాన్ని నినాదాలతో హోరెత్తించారు.

ఓయు విద్యార్థులు

ఓయు విద్యార్థులు


సోమవారం సుమారు 10మంది ఓయూ జేఏసీ విద్యార్థులు సచివాలయానికి వచ్చారు. నేరుగా సీ బ్లాక్‌ ముందు బారికేడ్ల వద్దకు చేరుకున్నారు.

ఓయు విద్యార్థులు

ఓయు విద్యార్థులు


కేసీఆర్‌ ఓయూకు వస్తే బొంద పెడతాం, కావాలంటే పేదలకు నీ ఫామ్ హౌస్‌ ఇచ్చుకో, ఉస్మానియా భూములను లాక్కోవద్దని తదితర నినాదాలు రాసిన ప్లకార్డులు, ఎన్‌ఎ్‌సయూఐ జెండాను ప్రదర్శిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓయు విద్యార్థులు

ఓయు విద్యార్థులు

కొందరు విద్యార్థులు బారికేడ్లు తెరిచి సీ బ్లాక్‌ ప్రాంగణంలోకి ప్రవేశించారు. పోలీసులు వెంటనే తేరుకొని విద్యార్థులను అడ్డుకొని బారికేడ్ల అవతలకు తోసేశారు.

ఓయు విద్యార్థులు

ఓయు విద్యార్థులు

విద్యార్థుల నోరుమూసేస్తూ, వారిని అరెస్ట్‌ చేసేందుకు పోలీసు వాహనాల వైపు ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థి జేఏసీ నేత పున్న కైలాస్‌తోపాటు మరికొంత మంది విద్యార్థులు కిందపడ్డారు.

ఓయు విద్యార్థులు

ఓయు విద్యార్థులు


కైలాష్‌ తుంటికిగాయం కావడంతో సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో, ఆందోళనకు గురైన పోలీసులు అతని ముఖంపై నీళ్లు చిలుకరించి, మంచినీళ్లు తాగించి సపర్యలు చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.

 ఓయు విద్యార్థులు

ఓయు విద్యార్థులు

ఓయూకు చెందిన 11 ఎకరాల స్థలాన్ని పేదలకు ఇస్తామని కేసీఆర్‌ ప్రకటించడానికి అదేమీ ఆయన జాగీరు కాదని ఆ భూములపై ఎవరు కన్నేసినా ఊరుకోబోమని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి.

ఓయు విద్యార్థులు

ఓయు విద్యార్థులు

సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వర్సిటీలో సోమవారం ఏబీవీపీ, పీడీఎ్‌సయూ, డీఎ్‌సయూ, టీవీఎస్‌ ఆధ్వర్యంలో వేర్వేరుగా దిష్టిబొమ్మలు దహనం చేశారు.

ఓయు విద్యార్థులు

ఓయు విద్యార్థులు

కేసీఆర్‌ దిష్టిబొమ్మతో ఆర్ట్స్‌ కాలేజీ నుంచి ఎన్‌సీసీ గేటు వరకూ శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ఆర్ట్స్‌ కాలేజీ వద్ద విద్యార్థులు కేసీఆర్‌ దిష్టిబొమ్మకు ఉరి తీశారు. పేద ప్రజలకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఓయూ భూములను కాపాడుకుంటామని ఏబీవీపీ నాయకులు తెలిపారు.

ఓయు విద్యార్థులు

ఓయు విద్యార్థులు

ఓయూ భూములను పేదప్రజలకు అప్పగించేందుకు అవేమీ కేసీఆర్‌ దొరల గడీలు కావని ఓయూ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఓయు విద్యార్థులు

ఓయు విద్యార్థులు

తెలంగాణ వస్తే కష్టాలుండవని ఉద్యమ సమయంలో చెప్పి... ఇప్పుడు పోలీసులతో కొట్టిస్తారా..? రాష్ట్రం వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ కూడా వెలువరించలేదని ఓయు విద్యార్థులు అన్నారు.

 ఓయు విద్యార్థులు

ఓయు విద్యార్థులు

బంగారు తెలంగాణ అంటే ఇదేనా? వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కేసీఆర్‌ ఓయూ భూములపై కన్నేశారు, మేం పేదలకు వ్యతిరేకం కాదని, ఈపాటికే కబ్జాకు గురైన వందల ఎకరాల ఓయూ భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 ఓయు విద్యార్థులు

ఓయు విద్యార్థులు

కేసీఆర్‌ అంతగా అనుకుంటే 150 ఎకరాలున్న తన ఫామ్ హౌస్‌ భూములను పేదలకు ఇవ్వాలను విద్యార్థులు డిమాండ్ చేశారు.

ఓయూ భూముల జోలికొస్తే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. వారు సమతా బ్లాక్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో సచివాలయం ముందు బైఠాయించి ధర్నా చేశార. ఓయులో ఇప్పటికే భూములు ఆక్రమణకు గురయ్యాయన్నారు.

వాటిని విడిపించాల్సింది పోయి, ఇంకా ఇళ్ల నిర్మాణానికి ఇస్తామనడం విడ్డూరమన్నారు. విద్యార్థుల వల్లనే తెలంగాణ సాధ్యమైందని, ఇప్పుడు తమ గొంతులను నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులకు మేలు కలిగించే ఒక్క నిర్ణయం కూడా కేసీఆర్ తీసుకోలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+