Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులిటెన్: ఆందోళన వద్దంటూ చిరంజీవి, ప్రమాదానికి కారణం అదే

హైదరాబాద్: శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సినీనటుడు సాయిధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. స్పార్ట్స్ బైక్ నడుపుతూ ఒక్కసారిగా బైక్ అదుపుతప్పి కిందపడిపోయారు ఈ ప్రమాదంలో ధరమ్ తేజ్ కుడి కంటిపై భాగం, ఛాతీ భాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి.

నిలకడగా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి, కానీ..

నిలకడగా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి, కానీ..

ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. అయితే, కాలర్ బోన్ విరిగిందని, శరీరంలో అంతర్గతంగా గాయాలేవీ లేవని తెలిపారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సని అవసరం లేదన్నారు. కాలర్ బోన్ విరగడంతో సాయి తేజ్‍‌కు వైద్యులు శస్త్ర చికిత్స చేయనున్నారు. ప్రస్తుతం సాయి తేజ్ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని, మరో 48 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

అపోలోలో సాయి ధరమ్ తేజ్‌కు మెరుగైన చికిత్స

అపోలోలో సాయి ధరమ్ తేజ్‌కు మెరుగైన చికిత్స

కాగా, సైబరాబాద్ కమిషనరేట్ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్ సమీపంలో శుక్రవారం రాత్రి సాయి తేజ్ ప్రమాదానికి గురయ్యారు. తీగల వంతెన వైపు నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. బైక్‌తో ఆయన కిందపడిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనానికి, పోలీసులకు సమాచారం అందించారు. ప్రథమ చికిత్స అనంతరం సినీనటుుడు సాయి ధరమ్ తేజ్‌గా గుర్తించిన పోలీసులు.. మాదాపూర్‌లోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ప్రముఖ సినటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత అల్లు అరవింద్, సందీప్ కిషన్ తదితరులు ఆస్పత్రికి తరలివచ్చారు. వైద్యులతో మాట్లాడి సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి సాయి తేజ్‌ను తరలించారు.

అభిమానులు ఆందోళన చెందవద్దన్న చిరంజీవి..

అభిమానులు ఆందోళన చెందవద్దన్న చిరంజీవి..

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నారని అల్లు అరవింద్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో సాయితేజ్ కు గాయాలయ్యాయని, అయితే, ప్రస్తుతం తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన చెప్పారు. ప్రమాద ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీల్లో రికార్డయ్యాయి. అయితే, ఆ వీడియోలో తేజ్ అతివేగంతో బైక్ నడిపినట్లు కనిపించలేదు. అదుపుతప్పడంతోనే కిందపడినట్లు తెలుస్తోంది.

సినీప్రముఖుల దిగ్భ్రాంతి.. సాయి తేజ్‌కు విశ్రాంతి

కాగా, సాయి ధరమ్ తేజ్‌కు నలుగురు డాక్టర్ల బృందం వైద్యం అందిస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అపోలో వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు. శుక్రవారం రాత్రి నుంచి అపోలో సోదరుడి దగ్గరే వైష్ణవ్ తేజ్ ఉన్నట్లు తెలిసింది. మిగిలిన వారు పరామర్శించి వెళ్లిపోయారు. చికిత్స అనంతరం సాయి ధరమ్ తేజ్ 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందని వైద్యులు చెప్తున్నారు. కాగా, సాయి ధరమ్ తేజ్ ప్రమాదంలో గాయపడినట్లు తెలిసిన పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయితేజ్ త్వరలోనే కోలుకుంటారని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Recommended Video

    తీన్మార్ మల్లన్నపై ప్రభుత్వానికి కక్ష్య సాధింపు అన్న విద్యార్థి నాయకులు!!
    ప్రమాదానికి ఇసుకే కారణమన్న ఏసీపీ

    ప్రమాదానికి ఇసుకే కారణమన్న ఏసీపీ

    శుక్రవారం రాత్రి తీగల వంతెన వైపు నుంచి ఐకియా వైపు వెళ్తుండగా సాయి తేజ్ తన స్పోర్ట్స్ బైక్ నుంచి కిందపడిపోయారని ఏసీపీ తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో సాయి తేజ్ హెల్మెట్ పెట్టుకున్నాడని, మద్యం సేవించలేదని చెప్పారు. రహదారిపై ఇసుక ఉండటం వల్ల బైక్ స్కిడ్ అయ్యిందని, దాని వల్లే తేజ్ వాహనాన్ని అదుపు చేయలేకపోయారని ఏసీపీ తెలిపారు. ప్రస్తుతం సాయితేజ్ ఆరోగ్యంగా నిలకడగా ఉందని ఆయన తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+