రాంరెడ్డి అంత్యక్రియలు పూర్తి: ఫోన్‌లో ఫ్యామిలీకి జగన్ పరామర్శ (ఫోటోలు)
ఖమ్మం: అనారోగ్యంతో కన్నుమూసిన తెలంగాణ పీఏసీ ఛైర్మన్, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. వెంకటరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అంత్యక్రియలకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
శనివారం ఉదయం ఆయన పార్ధీవ దేహానికి పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. సీఎల్పీనేత జానారెడ్డి, నల్గొండ ఎంపీ బుట్ట సుఖిందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, భట్టివిక్రమార్కలు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
వీరితోపాటు తెలంగాణ వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నివాళులర్పించారు. మరోవైపు రాంరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక మృతికి జిల్లా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా సంతాపం తెలిపింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సంతాపం తెలియజేశారు.

పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియలు పూర్తి
‘వెంకటరెడ్డి మంచి నాయకుడని, తన జీవితమంతా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కృషి చేశారని' ఆమె లేఖలో కొనియాడారు. ఆయన మృతితో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజలు మంచి నాయకుడిని కోల్పోయారన్నారు. తన తరఫున బాధిత కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని సోనియాగాంధీ తెలిపారు.

పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియలు పూర్తి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. రాంరెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పని చేశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న రాంరెడ్డి వెంకట రెడ్డి కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన కన్నుమూశారు.

పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియలు పూర్తి
ఆయన మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కెసిఆర్, ఖమ్మం జిల్లా నేతలు, ఇతర పార్టీలు సంతాపం తెలిపారు. గతంలో సుజాత నగర్ నియోజకవర్గం ఉండేది. అక్కడి నుంచి ఉప ఎన్నికల్లో రాంరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపొందారు.

పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియలు పూర్తి
ఆ తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన అయిదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వెంకట్ రెడ్డి 2009, 2014లలో పాలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నెల రోజుల క్రితం శ్వాస సంబంధ వ్యాధితో కిమ్స్‌లో చేరారు.

పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియలు పూర్తి
అమెరికాలోను చికిత్స పొందారు. 2009 నుంచి 2014 వరకు మంత్రిగా పని చేశారు. ఇతనికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. స్వస్థలం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాల గ్రామం. 1967లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1967 నుంచి 1977 వరకు పాతలింగాల సర్పించిగా ఉన్నారు.

పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియలు పూర్తి
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో రాంరెడ్డి వెంకటరెడ్డి సర్పంచ్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అనేక ఉన్నత పదవులను అందుకున్నారు. ఎల్ఎంబీ డైరెక్టర్, డిసిసి ఉపాధ్యక్షులుగా పని చేశారు. 1996లో ఉప ఎన్నిక ద్వారా సుజాత నగర్ ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 1999, 2004 నుంచి అక్కడి నుంచే గెలుపొందారు.












Click it and Unblock the Notifications