టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై తిరగబడ్డ జనం : చెప్పులు చూపిస్తూ.. బూతులు తిట్టేశారు
పరకాల : పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి స్థానిక ప్రజల నిరసన సెగ తగిలింది. పరకాలను వరంగల్ రూరల్ కు జిల్లా కేంద్రం చేయడంతో పాటు.. రెవెన్యూ డివిజన్ గా చేయడంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి విఫలమయ్యారని ఆరోపిస్తూ స్థానికులంతా పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేశారు.
పరకాల బస్టాండ్ సమీపంలో మహిళలతో పాటు పలువురు ఆందోళనకారులు ఎమ్మెల్యేకు వ్యతిరేకతంగా ఆందోళన చేస్తున్న సమయంలో.. స్పీకర్ మధుసూధనాచారి కాన్వాయ్ అటుగా వచ్చింది. దీంతో ఆందోళనకారులు స్పీకర్ కాన్వాయ్ ను అడ్డుతగిలారు. అక్కడినుంచి కదలనిచ్చేది లేదంటూ ఘెరావ్ చేశారు.

ఇక చేసేదేమిలేక స్పీకర్ తో మధుసూధనాచారితో పాటు అదే కారులో ఉన్న ఎమ్మెల్యే ధర్మారెడ్డి కూడా కిందకు దిగి ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులకు ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. వారంతా తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. వరంగల్ రూరల్ కు గీసుకొండను ఎలా జిల్లా కేంద్రంగా చేస్తాడంటూ ఎమ్మెల్యే ధర్మారెడ్డిని నిలదీశారు.
కొందరు మహిళలు ఎమ్మెల్యేకు చెప్పులు చూపెడుతూ.. పరకాలను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడంలో విఫలమైన పక్షంలో.. తమవద్దకు ఓట్ల కోసం రావద్దంటూ బూతు పురాణం కూడా మొదలుపెట్టారట. స్పీకర్ ఎదుటే మహిళలు ఎమ్మెల్యేను బూతులు తిట్టడంతో.. ఎమ్మెల్యేతో పాటు మధుసూధనాచారి కొంత అసౌకర్యంగా ఫీలయ్యారట. ఏదేమైనా.. కొత్త జిల్లాల మాటేమో గానీ స్థానిక ఎమ్మెల్యేలకు మాత్రం కొత్త తలనొప్పులు బాగానే తయారయ్యాయి అనుకుంటున్నారు జనం.












Click it and Unblock the Notifications