కెసిఆర్: గవర్నర్‌తో భోజనం చేసి చెప్పాల్సిందంతా చెప్పారు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గవర్నర్ నరసింహన్‌తో మంగళవారం రాత్రి భోజనం చేసి చెప్పాల్సిందంతా చెప్పేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలో రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన రాత్రి 9.40 గంటలకు బయటికి వచ్చారు.

pictures: KCR had dinner with governor

ఆయన వెంట మంత్రి జి.జగదీశ్‌రెడ్డి కూడా ఉన్నారు. గవర్నర్‌తో కలిసి వారు అక్కడే భోజనం చేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలను సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఉస్మానియా ఆస్పత్రి భవనం కూల్చివేత వివాదంపై కూడా కెసిఆర్ గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం.

శిథిలావస్థకు చేరిన భవనంలో ఆస్పత్రిని కొ నసాగించలేమని సీఎం కేసీఆర్‌ గవర్నర్‌కు స్పష్టం చేసినట్లు తెలిసింది. వారసత్వ సంపద అనే ఒకే ఒక్క కారణంతో అదే భవనంలో ఆస్పత్రిని కొనసాగించి రోగులను ప్రమాదంలో పడేయలేమని అన్నారని సమాచారం. ఇప్పుడున్న భవనంలో ఆస్పత్రిని కొనసాగించిన క్రమం లో ఏదైనా దుర్ఘటన సంభవిస్తే దానికెవరు బాధ్యత వహిస్తారని, ఈ విషయంలో ప్రభుత్వాన్ని తప్పుపట్టడంలో అర్థం లేదని చెప్పారని తెలిసింది.

pictures: KCR had dinner with governor

అసెంబ్లీ వ ర్షాకాల సమావేశాలను సెప్టెంబర్‌లో నిర్వహించాలనే యోచనలో ఉన్నామని, అదే సమావేశంలో విశ్వవిద్యాలయాల బిల్లును ప్రవేశపెట్టటానికి కసరత్తు చేస్తున్నట్లు గవర్నర్‌కు చెప్పారని తెలిసింది. గవర్నర్‌ నరసింహన్‌ శుక్రవారం ఢిల్లీకి వెళుతున్నారు. ఆదివారం వరకూ ఆయన అక్కడే ఉంటారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లతో భేటీ అవుతారు. రెండు తెలుగు రాష్ర్టాల్లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలను వారికి వివరిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+