ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాదులోని నాచారంలో గల ఇఎస్‌ఐ ఆసుపత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వరంగల్ జిల్లా లక్ష్మీనారాయణపురానికి చెందిన రజితకు 2012లో సమ్మయ్యతో వివాహం జరిగింది.
బతుకుదెరువుకోసం వీరు హైదరాబాద్‌లోని బోడుప్పల్‌కు వలసవచ్చి విద్యానగర్‌లో ప్రైవేట్ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్నారు. రజిత గర్భం దాల్చడంతో ఓ ప్రైవేట్ అసుపత్రిలో చూపించి ప్రసవం కోసం నాచారం ఇఎస్‌ఐ ఆసుపత్రిలో చేర్పించారు.
రజిత ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. నలుగురిలో ఒకరు ఆడపిల్ల, ముగ్గురు మగ పిల్లలని వైద్యులు చెప్పారు. తల్లీపిల్లలు క్షేమంగా ఉన్నారని అన్నారు.

ఉచిత వైద్యం
పిల్లలను 72 గంటల అత్యవసర విభాగంలో ఉంచి వైద్యం అందిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్పారు.

బరువు ఇలా..
నలుగురు పిల్లలు కూడా ఒక్కొక్కరూ 1.6 కేజీల బరువు ఉన్నారని పిల్లల వైద్యనిపుణులు తెలిపారు.

సిజేరియన్ ఆపరేషన్
రజితకు సిజేరియన్ ఆపరేషన్ చేసి నలుగురు పిల్లలకు ఇఎస్ఐ ఆస్పత్రి వైద్యులు పురుడు పోశారు.

వరంగల్ జిల్లాకు చెందినవారు..
వరంగల్ జిల్లా పాలకుర్తికి చెందిన రజితను అదే జిల్లాకు చెందిన లక్ష్మినారాయణపురానికి చెందిన సమ్మయ్య 2002లో పెళ్లి చేసుకున్నాడు.

మొదటి కాన్పులో ఆడపిల్ల
సమ్మయ్య, రజిత దంపతులకు మొదటి కాన్పులో ఓ అమ్మాయి పుట్టింది. ఇప్పుడు ఇది రెండో కాన్పు. నలుగురు పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు.

అందరూ క్షేమం
నలుగురు పిల్లలకు జన్మినచ్చిన తల్లి ఆరోగ్యంగా ఉందని వైద్యులు చెప్పారు. నలుగురు పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications