ముంచిన వర్షాలు: నాలాలో పడి మృతి (పిక్చర్స్)

హైదరాబాద్: హైదరాబాదు నగరాన్ని మరోసారి అకాల వర్షం ముంచేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వేసవి కాలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి, మర్నాడు మధ్యాహ్నం కురిసిన వర్షానికి మియాపూర్ ఆల్విన్‌కాలనీలో ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. సికింద్రాబాదులోని తుకారం గేట్ నాలాలో పడి ఓ వ్యక్తి మరణించాడు

పాతబస్తీలోని నాలాలో మంగళవారం సాయంత్రం ఇద్దరు చిన్నారులు పడిపోయారు. స్థానికులు ఒకర్ని రక్షించగా, మరో చిన్నారి మృతి చెందినట్లు తెలిసింది. అంతేగాక, సోమవారం అర్థరాత్రి నగరంలోని ట్యాంక్‌బండ్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎం.జె.మార్కెట్ తదితర ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. లక్డీకాపూల్ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.

మంగళవారం తెల్లవారు జాము నుంచి కురిసిన వర్షంతో మరోసారి నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. అమీర్‌పేట, చింతల్‌బస్తీ, బేగంపేట, లక్డీకాపూల్, బేగంపేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, నల్గొండ క్రాస్‌రోడ్డు, మలక్‌పేట తదితర ప్రాంతాల్లోని మెయిన్‌రోడ్లు నీటిలో మునిగిపోవటంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.

సికింద్రాబాదులోని నాలాలో..

సికింద్రాబాదులోని నాలాలో..

సికింద్రాబాదులోని తుకారాంగేట్ నాలాలో పడి ఓ వ్యక్తి మరణించాడు. భారీ వర్షాలే ఇందుకు కారణమని భావిస్తున్నారు.

లోతట్టు ప్రాంతాలు జలమయం

లోతట్టు ప్రాంతాలు జలమయం

హైదరాబాదులోని పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

రోడ్లపై నీరు..

రోడ్లపై నీరు..

రోడ్లపై నీరు ప్రవహించడంతో నిత్యం రద్దీగా ఉండే చాలా జంక్షన్లలో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది.

రంగంలోకి దిగిన అధికారులు

రంగంలోకి దిగిన అధికారులు

అప్రమత్తమైన మహానగర పాలక సంస్థ అత్యవసర ప్రత్యేక బృందాలు రంగంలో దిగి నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని తోడి వేయటంతో పాటు పలు చోట్ల నేలకొరిగిన చెట్ల కొమ్మలను తొలగించాయి.

సోమేష్ కుమార్ పర్యటన..

సోమేష్ కుమార్ పర్యటన..

ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాల్లో కమిషనర్ సోమేశ్‌కుమార్ పర్యటించి వర్షంతో తలెత్తిన సమస్యలను పరిశీలించారు.

మోకాలు లోతు నీరు...

మోకాలు లోతు నీరు...

ఇళ్లలోకి కూడా నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గుర్యయారు. ఇలా మోకాలు లోతు నీరు చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+