యాగంపై కెసిఆర్‌కు మోడీ లేఖ, చంద్రబాబుతో సయోధ్య: నారాయణ
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు గురువారం నాడు లేఖ రాశారు. ఐదు రోజుల పాటు కెసిఆర్ నిర్వహించిన ఆయుత చండీయాగం నేపథ్యంలో ఆయనను ప్రశంసించారు. అయుతచండీ మహాయాగం నిర్వహించడం సంతోషకరమని మోడీ లేఖలో పేర్కొన్నారు.
యాగం విజయవంతం కావడం పట్ల మోడీ అభినందనలు తెలిపారు. యాగం వల్ల ఆధ్యాత్మిక సంక్షేమ, లోక కల్యాణం, విశ్వశాంతి చేకూరుతుందని ఆకాంక్షించారు. విశ్వశాంతి కోసం యాగం నిర్వహించడం మంచిదన్నారు. యాగం ఫలితాన్నిస్తుందన్నారు.

చంద్రబాబు-కెసిఆర్‌ల మధ్య సయోధ్య: నారాయణ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల మధ్య సయోధ్య కుదిరిందని సిపిఐ నేత నారాయణ గురువారం అన్నారు. ఇప్పటికైనా ఇరువురు నేతలు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆలోచిస్తే మంచిదని చెప్పారు.
ప్రధాని మోడీ ఇప్పటికైనా విదేశీ మోజు నుంచి బయటకు రావాలని ఎద్దేవా చేశారు. అత్యవసరంగా ఇటీవల పాకిస్తాన్ వెళ్లవలసిన అవసరం ప్రధానికి ఏమి వచ్చిందని నిలదీశారు. వచ్చే నెల 8, 9, 10 తేదీల్లో జాతీయ సిపిఐ సభలు ఉంటాయని చెప్పారు.
అసహనంపై మాట్లాడేందుకు ప్రధాని మోడీ సిద్ధంగా లేరని సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. 2015లో ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరగడం బాధాకరమన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదన్నారు. మోడీ అభివృద్ధి అంతా కార్పోరేట్ అభివృద్ధి అన్నారు.












Click it and Unblock the Notifications