డ్రగ్స్: రేవంత్ రెడ్డిపై నాయిని సంచలనం, బిజెపి నేత ఘాటు కౌంటర్
డ్రగ్ రాకెట్ అంశంపై అధికార టిఆర్ఎస్, విపక్ష టిడిపి, కాంగ్రెస్, బిజెపిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
హైదరాబాద్: సినీ పరిశ్రమతో పాటు, తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతున్న డ్రగ్ రాకెట్ అంశంపై అధికార టిఆర్ఎస్, విపక్ష టిడిపి, కాంగ్రెస్, బిజెపిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
డ్రగ్ రాకెట్ వ్యవహారంపై బిజెపి నేత రఘనందన్ రావు, టిడిపి నేత రేవంత్ రెడ్డిలు అధికార పార్టీపై విమర్శలు చేశారు. దీనిపై మంత్రి నాయిని నర్సింహా రెడ్డి తీవ్రంగా స్పందించారు.
రేవంత్ రెడ్డి, రఘునందన్ రావులు పబ్బులకు వెళ్తారేమోనని నాయిని ఎద్దేవా చేశారు. దీనిపై రఘునందన్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

విమర్శలు చేస్తే డిఫేమేషన్ అంటూ ప్రభుత్వం, అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని రఘునందన్ మండిపడ్డారు. ఈ బెదిరింపులకు లొంగేది లేదన్నారు.
తాను, రేవంత్ పబ్బులకు వెళ్తామన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని రఘునందన్ చెప్పారు. నాయినికి తాను సవాల్ చేస్తున్నానని, వీటిపై తేల్చేందుకు ఏ సెంటర్‌కు వస్తారో రావాలన్నారు.
తాను రక్ష పరీక్షకు సిద్ధమని చెప్పారు. మరి మీరు (నాయిని), మీ సహచర మంత్రులు కూడా అందుకు సిద్ధమా, ఏ కోర్టుకు వస్తారో రావాలని సవాల్ చేశారు. జీవితంలో తాను అల్కాహాల్ ముట్టలేదన్నారు. దిగజారుడు మాటలు వద్దన్నారు.
-
కేసీఆర్ కు జీతం కట్ పై నిర్ణయం: సీఎం రేవంత్ -
వాహనదారులకు అదిరిపోయే శుభవార్త.. మార్చి 23నుండి మీ సమయం, డబ్బు రెండూ ఆదా! -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..?












Click it and Unblock the Notifications