వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: ఆ సమాచారమే రాజీవ్ కొంపముంచిందా, శిరీషను 'ఎర'గా వేశాడా?

బ్యూటీషీయన్ శిరీష కేసులో ఇంకా మిస్టరీ వీడడం లేదు. కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకొన్న ఘటన వల్లే శిరీష ఆత్మహత్య చేసుకొందని ఈ కేసులు నిందితుడు రాజీవ్ చెబుతున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్యూటీషీయన్ శిరీష కేసులో ఇంకా మిస్టరీ వీడడం లేదు. కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకొన్న ఘటన వల్లే శిరీష ఆత్మహత్య చేసుకొందని ఈ కేసులు నిందితుడు రాజీవ్ చెబుతున్నారు. అయితే కుకునూర్ పల్లిలోనే ఏదో జరిగిందనే విషయం బయటపడాల్సి ఉంది.

బ్యూటీషీయన్ శిరీష కేసులో సందేహలను నివృత్తి చేసుకొనేందుకుగాను పోలీసులు రెండురోజుల పాటు ఈ కేసులో నిందితులైన శ్రవణ్, రాజీవ్ లను పోలీసులు కస్టడీకి తీసుకొన్నారు.

రెండురోజుల పాటు ఈ కేసులో తమకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకొనే ప్రయత్నాలను చేశారు. అయితే ఇంకా కూడ ఈ కేసులో ఇంకా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి, శిరీష ఆత్మహత్యలను వారు కుటుంబసభ్యులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టును ఐదురోజులపాటు శ్రవణ్, రాజీవ్ లను కస్టడీ కోరారు.అయితే కోర్టు మాత్రం రెండురోజుల పాటు మాత్రమే కోర్టు కస్టడీకి అనుమతినిచ్చింది. కస్టడీ కూడ ముగిసింది.

 శిరీష ఆత్మహత్య కేసుకు కుకునూర్ పల్లితోనే లింక్?

శిరీష ఆత్మహత్య కేసుకు కుకునూర్ పల్లితోనే లింక్?

బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య కేసుకు కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి క్వార్టర్ లోనే ఏదో జరగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే శిరీషను , తేజస్విని వదిలించుకోవాలని రాజీవ్ భావించాడు. ఈ మేరకు శ్రవణ్ సహయం తీసుకొన్నాడు. అయితే ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి క్వార్టర్ లో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలోనే శిరీష ఆత్మహత్య చేసుకొందని పోలీసుల విచారణలో రాజీవ్ చెప్పాడని సమాచారం. అయితే క్వార్టర్ లో శిరీషపై అత్యాచారయత్నం జరిగిందా? లేదా అత్యాచారం చేశారా? అనే విషయం ఫోరెన్సిక్ నివేదికలో బయటపడనుంది. అయితే రాజీవ్, శ్రవణ్ చెప్పే సమాచారం మేరకు ఎస్ఐ ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి.దీంతో పాటుగా తనను రాజీవ్ వదిలించుకోవాలని చేసిన విషయాలు తెలుసుకొని శిరీష ఆత్మహత్య చేసుకొందని రాజీవ్ పోలీసులకు చెప్పారు.

మూడుసార్లు శ్రవణ్ కు ఫోన్ చేసిన ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి

మూడుసార్లు శ్రవణ్ కు ఫోన్ చేసిన ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి

కుకునూర్ పల్లి నుండి హైద్రాబాద్ కు తిరిగివచ్చే లోపుగా ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మూడు సార్లు శ్రవణ్ కు ఫోన్ చేశారు. అసలు ఏం జరుగుతోందనే విషయాలను తెలుసుకొనే ప్రయత్నం చేశారని సమాచారం. తమ పోలీస్ స్టేషన్ లిమిట్స్ ను దాటి వెళ్ళారా లేదా అనే విషయాలను కూడ ప్రభాకర్ రెడ్డి ఆరా తీశారు అంతేకాదు బ్యూటీషీయన్ ఆత్మహత్య చేసుకొన్న తర్వాత కూడ వీరిద్దరూ కూడ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి పేరును బయటకు రాకుండా చూడాలనుకొన్నారు.

శిరీషపై ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి మోజు కలిగిందని

శిరీషపై ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి మోజు కలిగిందని

కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి క్వార్టర్ కు శిరీష, తేజస్వినితో వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు వెళ్ళాం. అయితే వీరిద్దరిని వదిలించుకొనే ఆలోచనే రాజీవ్ లో ఉంది.అయితే ఈ విషయమై ఎస్ఐ ప్రభాకర్ రెడ్డితో మాట్లాడే సమయంలో శిరీషపై ఆయనకు మోజు కలిగిందని గమనించినట్టు రాజీవ్ పోలీసుల విచారణలో చెప్పాడు. అందుకే ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి వద్ద శిరీషను ఏకాంతంగా ఉంచేందుకు ప్రయత్నించినట్టుగా రాజీవ్ పోలీసుల విచారణలో పేర్కొన్నారు. అయితే తనను ఏకాంతంగా ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి వద్ద ఉంచకూడదంటూ శిరీష తనకు వాట్సాప్ లో మేసేజ్ కోరినట్టు చెప్పిందన్నారు.

పెళ్ళి చేసుకొందని తప్పుడు సమాచారం

పెళ్ళి చేసుకొందని తప్పుడు సమాచారం

తాను శిరిష భార్య,భర్తలని తప్పుడు సమాచారం తేజస్వినికి తెలిసిందన్నారు.. అయితే అంతకు ముందే తేజస్విని వివాహం చేసుకోవాలని భావించినట్టు రాజీవ్ పోలీసులకు చెప్పారు. ఈ విషయమై తేజస్విని తనతో పాటు శిరీషతో గొడవకు దిగిందన్నారు. అయితే తనకు తెలియకుండానే శిరీషతో పలుమార్లు గొడవకు దిగిన విషయాన్ని పోలీసుల విచారణలో తేజస్విని చెప్పింది. అయితే తేజస్వినితో వివాహన్ని రాజీవ్ తల్లి ఒప్పుకోలేదు. దీంతో తేజస్వినిని కూడ వదిలించుకోవాలని రాజీవ్ భావించారు.

ఫామ్ హౌజ్ లో కూడ ఎలాంటి ఆధారాలు రాలేదు

ఫామ్ హౌజ్ లో కూడ ఎలాంటి ఆధారాలు రాలేదు

కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని ఫామ్ హౌజ్ వద్ద కూడ ఆదారాలను సేకరించినట్టు పోలీసులు చెప్పారు. ఫామ్ హౌజ్ వద్ద ఉన్న సిసి టీవి పుటేజీని పరిశీలించినట్టు చెప్పారు.అయితే ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. ఫామ్ హౌజ్ వద్ద ఉన్న సిసిటీవి పుటేజీ వద్ద కూడ వీరి దృశ్యాలు లభ్యం కాలేదని డీసీపీ వెంకటేశ్వర్ రావు ప్రకటించారు. ఫామ్ హౌజ్ యజమానిని అడిగిన విషయాలను చెబుతారన్నారు.

English summary
Rajeev, who is accused in the death of beautician Sirisha, has revealed shocking facts about her and Kukunoorpally Sub Inspector Prabhakar Reddy. He told police that he had no intention to continue relationship either with Sirisha or Tejaswini. Rajeev informed police that he wanted to marry Tejaswini but his parents were against her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X