క్రిమినల్ కేసు పెడ్తా: టీవీ9, రజినీకాంత్‌పై రాంగోపాల్ వర్మ నిప్పులు
Recommended Video

హైదరాబాద్: తెలుగు వార్తా ఛానల్ 'టీవీ9'పై క్రిమినల్ కేసు పెట్టనున్నట్టు మంగళవారం ఉదయం ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ హెచ్చరించారు. మరో ట్వీట్ పెడుతూ ఆ ఛానల్ యాంకర్ రజనీకాంత్‌పై కూడా నిప్పులు చెరిగాడు.
నిజాలను నాశనం చేస్తూ.. రజినీకాంత్ తప్పుడు వార్తా కథనాలను ప్రసారం చేయిస్తున్నారని వర్మ ఆరోపించారు. అసత్యాలను ప్రసారం చేస్తూ, తనపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీవీ9కి హెచ్చరిక
ఓ నేరంపై విచారణ జరుగుతూ ఉండగా, 'విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు' అంటూ వార్తలు అందించడం కూడా నేరమేనని.. అతి త్వరలో 'టీవీ9' భారత చట్టాలను ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించాడు.
దేవికి క్షమాపణలు చెప్పినట్లు వార్తలు
గత శనివారం నాడు జీఎస్టీ(గాడ్ సెక్స్ అండ్ ట్రూత్), దేవీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసుల నేపథ్యంలో సీసీఎస్ పోలీసుల విచారణకు వర్మ హాజరైన విషయం తెలిసిందే. కాగా, మహిళా సంఘం నేతలపై చేసిన అసభ్యకర కామెంట్స్ పై శనివారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, దేవికి వర్మ క్షమాపణ చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

మీడియా వార్తలపై వర్మ ఆగ్రహం
హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల విచారణ తరువాత మీడియాలో వస్తున్న వార్తలపై రాంగోపాల్ వర్మ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జీఎస్టీ చిత్రాన్ని తాను తీయలేదని, స్క్రిప్టును మాత్రమే ఇచ్చానని పోలీసులకు చెప్పానని పలు వార్తా ఛానళ్లు, పత్రికల్లో వార్తలు వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. దాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. తాను సినిమా నిర్మాణంలోనూ భాగస్వామినేనని చెప్పాడు. సినిమాకు తాను సాంకేతిక సహకారాన్ని మాత్రమే ఇచ్చానని ఎలా రాస్తారని ప్రశ్నించాడు.

టీవీ9 ఓ జోకర్ ఛానలంటూ
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వర్మ ఓ పోస్టును పెడుతూ.. ఓ ఆంగ్ల పత్రిక రాసిన కథనాన్ని పోస్టు చేశారు. అలాగే టీవీ9 పై తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. టవీ9 ఒక సర్కస్ జోకర్ ఛానెల్ అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. అంతేగాక, ‘నిజాయితీ'పై ఓ పోల్ పెట్టగా తనకు 85శాతం మంది మద్దతు పలుకగా, రజినీకాంత్‌కు 15శాతం మందే మద్దతుగా నిలిచారని వర్మ పేర్కొన్నారు.
-
హైదరాబాద్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్.. కొత్త ప్రపంచంలోకి వెళ్లిన ఫీలింగ్.. -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
ఆ జిల్లాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చిన ఐఎండీ! -
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్‌ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
హైదరాబాద్ కు తలమానికంగా మరో రైల్వే స్టేషన్ రెడీ అన్న కేంద్రమంత్రి -
మూడు ముళ్లు బంధంతో ఒక్కటైన "అల్లు శిరీష్ - నైనికా"..! -
ఉచిత బస్సు ప్రయాణం చేసేవారికి ఆర్టీసీ మరో శుభవార్త! -
హైదరాబాద్ లో ఆ ఫ్లైఓవర్ సంగతి తేల్చండి.. !! -
"హైదరాబాద్"లో నీటి సరఫరా బంద్.. ఎప్పుడు ? ఎక్కడెక్కడంటే ? ? -
మాటలతో, మూటలతో ఎన్నికల్లో గెలిచేవాళ్లం కాదు - సీఎం రేవంత్ రెడ్డి -
హైదరాబాదీ మటన్ దాల్చా.. ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు!












Click it and Unblock the Notifications