'రియల్' పేరిట కిలేడీల మోసం, రూ.కోటి వసూలు: ఐదుగురి అరెస్ట్
హైదరాబాద్: రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను చిలకలగూడ పోలీసులు ఆదివారం నాడు అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో రూ.కోటీ మేర నిందితులు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని అరెస్టు చేశారు.
అరెస్టైన అయిదుగురు నిందితుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. వారి నుంచి రూ.2 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నేరడిగొండ పరువు హత్య కేసుపై విచారణ
ఆదిలాబాద్ జిల్లాలోని నేరేడిగొండ మండల కేంద్రంలో జరిగిన పరువు హత్య కేసుపై విచారణ జరిగింది. విచారణ కోసం చెల్లప్ప కమిషన్ చైర్మన్ చెల్లప్ప, సభ్యులు ఎస్కే నాగు, ఐటీడీఏ పీవో ఆర్‌వీ కర్నల్, ఆర్టీవో సుధాకర్‌రెడ్డిలు వెళ్లారు. రెండు రోజుల క్రితం పరువు కోసం కూతురిని తల్లిదండ్రులు హత్య చేసిన విషయం తెలిసిందే.
కూలీని చంపిన సూపర్ వైజర్
రంగారెడ్డి జిల్లాలో ఓ సూపర్ వైజర్‌కు, కూలీకి మధ్య జరిగిన ఘర్షణలో కార్మికుడు మృతి చెందాడు. సూపర్ వైజర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటడన ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడలో ఆదివారం చోటు చేసుకుంది.
గ్రామశివారులోని ఇటుకల బట్టీలో కూలీగా పని చేస్తున్న సుధాకర్, సూపర్ వైజర్ బ్రహ్మయ్యకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సూపర్ వైజర్ పక్కనే ఉన్న గొడ్డలితో తలపై కొట్టడంతో సుధాకర్ మృతి చెందాడని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications