అధికారం లైసెన్స్ గా భావించొద్దు.. టీఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి చురకలు
కొడంగల్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఇప్పుడే ఏం మాట్లాడలేమని.. పార్టీ నేతలతో కూలంకషంగా చర్చించాక వివరాలు వెల్లడిస్తామన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయా, టీఆర్ఎస్ ప్రలోభాలకు గురిచేసిందా లాంటి విషయాలపై సమగ్ర చర్చ అవసరమన్నారు. రాజకీయంలో గెలుపోటములు సహజమేనని.. వాటితో సంబంధం లేకుండా ప్రజాపక్షం వహిస్తామని చెప్పుకొచ్చారు. దాదాపు యాభై ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. గెలుపోటములను ఒకే రీతిన చూస్తుందని చెప్పారు

అటు ఓటమిని అంగీకరిస్తూనే.. ఇటు టీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించారు రేవంత్ రెడ్డి. ఈ విజయాన్ని టీఆర్ఎస్ అదనుగా తీసుకోవద్దని హితవు పలికారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రజలిచ్చిన లైసెన్స్ గా భావించొద్దని ఎద్దేవా చేశారు. రైతుల ఆత్మహత్యలు ఆపాలని, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని సూచించారు.

-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications