ఉరిశిక్షకు సిద్ధం, నేనేంటో కేటీఆర్ ఏంటో తెలుస్తుంది: రేవంత్ రెడ్డి
తాను డ్రగ్స్ తీసుకుంటానని ఆరోపణలు చేసిన తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డిపై టిడిపి నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్: తాను డ్రగ్స్ తీసుకుంటానని ఆరోపణలు చేసిన తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డిపై టిడిపి నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
చదవండి: తెరపైకి అల్లు అర్జున్, రానా, రవితేజ.. ఎందుకంటే: డ్రగ్ కేసులో చార్మి దాటవేస్తే
తాను డ్రగ్స్ తీసుకున్నట్లు రుజువైతే ఉరిశిక్షకైనా సిద్ధమని వ్యాఖ్యానించారు. తన నుంచి, అలాగే మంత్రి కేటీఆర్ నుంచి రక్త నమూనాలు తీసుకొని పరిశీలిస్తే ఎవరు ఏమిటో తెలుస్తుందన్నారు.

పుట్టినప్పటి నుంచి ఇంత వరకు తాను డ్రగ్స్ ముట్టినట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు. డ్రగ్స్ అధికారులకు కేవలం గుడుంబా, గంజాయి పట్టుకునేందుకు మాత్రమే అధికారం ఉందన్నారు.
ఇంటర్నేషనల్ స్థాయిలో డ్రగ్స్ వ్యవహారం కొనసాగినప్పుడు కేంద్రం సహకారం తీసుకోవాలన్నారు. డ్రగ్స్ వాడే వారిని మాత్రమే కాదని, తయారుదారీలను కూడా పట్టుకుంటేనే ప్రయోజనం అన్నారు.












Click it and Unblock the Notifications