'టిఆర్ఎస్‌లోకి రేవంత్ రెడ్డి'పై ఆగ్రహం, ఇదేం పని: జానారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా? అంటే అధికార తెరాస పార్టీ నాయకులు అవుననే అంటున్నారు. పాలేరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుచరితా రెడ్డికి తెలుగుదేశం పార్టీ మద్దతు పలికింది.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉన్న పెద్ద దిక్కు ప్రస్తుతం రేవంత్ రెడ్డియే అనే వాదన ఉంది. అదే సమయంలో పాలేరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టిడిపి మద్దతు పలుకుతోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం ప్రారంభమైంది.
దీనిపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నానని తెరాస నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. తెరాస నేతలు వాళ్ల సొంత పత్రికలో ఈ రాతలు రాయిస్తున్నారన్నారు.

రాష్ట్రానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్నానని, అంతేకానీ, పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. రాంరెడ్డి మృతి చెందిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి మేరకు ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు.
హామీలు నెరవేర్చడం లేదు: జానా రెడ్డి
ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతోందని కాంగ్రెస్ శానససభాపక్ష నేత జానారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ హామీలు నెరవేరుస్తామని కాలం గడుపుతోందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని అధికార పార్టీ కుట్రలకు పాల్పడుతోందని, ఇది సరికాదన్నారు.












Click it and Unblock the Notifications