రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం: టీడీపీకి రాజీనామా!?
హైదరాబాద్: లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోనున్నారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. రేవంత్ తన సోదరుడు కొండల్ రెడ్డితో ఆసక్తికర అంశం చెప్పినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలవాలని, తాను పార్టీని వీడే అంశంపై ఆయనతో చర్చించాలని సోదరుడు కొండల్ రెడ్డికి రేవంత్ సూచించినట్లుగా వినికిడి.

మంగళవారం నాడు ఏపీ, తెలంగాణ టీడీపీ నేతలు ఎల్ రమణ, పయ్యావుల కేశవ్ తదితరులు చంచల్ గూడ జైలులో రేవంత్ రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా రేవంత్ తన సోదరుడితో మాట్లాడుతూ... పయ్యావులతో కలిసి చంద్రబాబును కలవాలని, పార్టీకి తాను రాజీనామా చేసే అంశంపై చర్చించాలని సూచించారని తెలుస్తోంది. ఈ లంచం ఇవ్వజూపిన కేసులో పార్టీని, చంద్రబాబును దూరంగా ఉంచాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. వారికి మలికి అంటించకుండా రేవంత్ పూనుకున్నారని భావించవచ్చునని అంటున్నారు.
మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటలకు రేవంత్ రెడ్డిని చంచల్ గూడ జైలు నుండి చర్లపల్లి జైలుకు తరలించారు. అతనిని గంగా బ్యారెక్‌లో ఉంచారు.












Click it and Unblock the Notifications