మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసుకు స్పందించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పంపిన లీగల్ నోటీసుపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందించారు. లీగల్ నోటీసును వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని కౌంటర్ పంపారు. గత నెల 28న రేవంత్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసు పంపిన విషయం తెలిసిందే. దీనికి రేవంత్‌రెడ్డి ఏడు పేజీల సమాధానమిచ్చారు.
'మీ క్లయింట్ సరైన వివరాలు మీకు అందించలేదని, మీడియా సమావేశంలో మాట్లాడిన వీడియో సరిగా వినపడట్లేదని ' అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కేంద్రంగా జరిగిందని, తెలంగాణ ఉద్యమంతో కేటీఆర్‌కు సంబంధం లేదని.. ఈ దేశంలో లేనందున ఆ బాధ తెలియదని రేవంత్ అందులో పేర్కొన్నారు.

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల విషయంలో నిరుద్యోగుల తరఫున తాను మాట్లాడానని, టీఎస్‌పీఎస్సీ సాంకేతిక పరిజ్ఞానం మొత్తం ఐటీశాఖ అందిస్తుందని, అలాంటప్పుడు కేటీఆర్ తనకు సంబంధం లేదని ఎలా చెబుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్‌రెడ్డి నియామకం కూడా ఐటీశాఖ ద్వారానే జరిగిందని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.












Click it and Unblock the Notifications