హైదరాబాద్ చేరుకున్న సత్యనాదెళ్ల
హైదరాబాద్: మాజీ ఐఏఎస్ అధికారి, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తండ్రి బీఎన్ యుగంధర్(81) అనారోగ్యంతో బంజారాహిల్స్‌లోని తన నివాసంలో శుక్రవారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కాగా, సోమవారం యుగంధర్ అంత్యక్రియలు జరగనున్నాయి.
తండ్రి అంత్యక్రియల కోసం సత్య నాదెళ్ల లండన్ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. బుక్కాపురం నాదెళ్ల(బీఎన్) యుగంధర్ స్వస్థలం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం. 1962 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందిన యుగంధర్.. ఆంధ్రప్రదేశ్ తోపాటు కేంద్ర ప్రభుత్వంలోనూ పలు కీలక హోదాల్లో పనిచేశారు.

పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ప్రధాని కార్యాలయ, గ్రామీణాభివృద్ధి శాఖ విభాగంలో సేవలు అందించారు. యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో 2004-2009 వరకు ప్రణాళిక సంఘం సభ్యుడిగా పనిచేశారు.
1988-1993 వరకు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమికి డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఐఏఎస్‌గా సేవలందించిన యుగంధర్.. పేదల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు. కాగా, తన తండ్రి కమ్యూనిస్టు కాదని, కానీ కొన్ని కమ్యూనిస్టు భావజాలాలు ఉన్నాయని గతంలో సత్య నాదెళ్ల చెప్పారు.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications