దసరా వేళ ప్రత్యేక రైళ్లు - రూట్లు, షెడ్యూల్ ఖరారు..!!

దసరా వేళ రైళ్లన్నీ రద్దీగా మారాయి. సెలవులు ప్రారంభం కావటంతో రిజర్వేషన్ లేక ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో, దక్షిణ మధ్య రైల్వే బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం 644 ప్రత్యేక సర్వీసులు ఈ నెల 15 వరకు అందుబాటులో ఉండనున్నాయి. సికింద్రాబాద్‌, కాచిగూడ, మహబూబ్‌నగర్‌, తిరుపతి రైల్వేస్టేషన్ల నుంచి ముఖ్యమైన రూట్లలో ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

దక్షిణ మధ్య రైల్వే నుంచి 170, ఇతర ప్రాంతాల నుంచి దక్షిణ మధ్య రైల్వే మీదుగా 115 రైళ్లను నడిపించనున్నారు. మరో 185 రైళ్లు పాసింగ్ త్రూ రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రూట్లను ప్రకటించారు. సికింద్రాబాద్-కాకినాడ, సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ- నాగర్ సోల్, సికింద్రాబాద్-మద్లాటౌన్, సికింద్రాబాద్-సుబేదార్ గంజ్, హైదరాబాద్-గోరఖ్ పూర్, మహబూబ్ నగర్-గోరఖ్ పూర్, సికింద్రాబాద్-దానాపూర్, సికింద్రాబాద్-రక్సాల్,సికింద్రాబాద్-అగర్తాల, సికింద్రాబాద్-నిజాముద్దీన్ , సికింద్రాబాద్-బెర్హంపూర్ , సికింద్రాబాద్​- విశాఖపట్టణం ఉన్నాయి.

SCR announces special trains as Dasara Special details here

సికింద్రాబాద్-సంత్రగచ్చి, తిరుపతి-మచిలీపట్నం, తిరుపతి-అకోలా, తిరుపతి-పూర్ణ, తిరుపతి-హిసర్, నాందేడ్-ఎరోడ్, జాల్నా-చప్రా, తిరుపతి-షిర్డీ, తదితర ముఖ్యమైన రూట్లలో ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రైల్వే స్టేషన్ల వద్ద ప్రయాణికుల తాకిడి పెరిగింది. రైలు వచ్చే మూడు నాలుగు గంటల ముందే వచ్చి ఎదురూచూస్తున్న పరిస్థితి నెలకొంది. రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+