వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటుకు నోటు కేసులో రెండోరోజు కొనసాగుతోన్న రేవంత్ విచారణ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని మంగళవారం 8 గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించింది. బుధవారం రెండోరోజు విచారణకు పిలించింది. రేవంత్ ను విచారించే సమయంలో అందుబాటులో ఉండాలని ఐటీ, ఏసీబీ అధికారులను కోరింది ఈడీ.

second day continues revanth enquiry

క్రాస్ ఇంటరాగేషన్ ..
ఓటుకు నోటు కేసులో డబ్బులు తీసుకొచ్చిన ఉదయ్ సింహ ... ఎమ్మెల్సీగా బరిలో ఉన్న వేం నరేందర్ రెడ్డి ఈడీ అధికారులు విచారించారు. వారిని ప్రశ్నించిన అంశాలే రేవంత్ ను ఇంటరాగేట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో రూ.50 లక్షలు ఎక్కడివి ?. ఎవరిచ్చారు ..? నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ఇస్తానన్న రూ.4.50 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చే వారు ? ఈ నగదును ఎవరు సమకూర్చారు. అనే అంశంపై ఈడీ అధికారులు తిప్పి తిప్పి రేవంత్ ను ప్రశ్నల వర్షం కురిపించారు. మంగళవారం జరగిన విచారణలో ఆయన తనకేమీ తెలియదు .. కాదు అనే సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే రెండోరోజు విచారణకు రావాలని అధికారులు కోరినట్టు స్వయంగా రేవంత్ రెడ్డి మీడియాకు తెలిపారు.

second day continues revanth enquiry

ముందు విడి విడిగా .. తర్వాత ఒకేసారి విచారణ
ఈ కేసులో ముందుగా ఉదయ్ సింహ, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డిని విడి విడిగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ సమయంలో వారు చెప్పే సమాధానాలను రికార్డ్ చేస్తున్నారు. సాధారణంగా ఈడీ విచారణ ఓ బుక్ లేట్ ఇచ్చి అందులో ఉన్న ప్రశ్నలకు సమాధానం నింపాల్సి ఉంటుంది. తిప్పి తిప్పి ప్రశ్నించడంతో ... తడబడి చెప్పే సమాధానంతో విచారణలో పురోగతి సాధిస్తుందని అధికారులు భావిస్తున్నారు. తర్వాత అందరినీ ఒకేసారి పిలిచి .. మళ్లీ ప్రశ్నిస్తారు. ఈ సమయంలో సంధించే ప్రశ్నలకు వారు ఇచ్చే సమాధానాలను బట్టి విచారణ ఉంటుంది. ఆ రెండు సమాధానాలు సరిపోకుంటే ... విచారణ వేగిరమై కేసు కొలిక్కి వస్తోందిన ఈడీ భావిస్తోంది.

English summary
The investigation of the ED continues to be intense in the case. Congress Working President Ravant Reddy, who is facing charges in this case, has been questioning for 8 hours on Tuesday. On Wednesday, the called for an inquiry. IT and ACB asked the authorities to be available at the time of inquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X