50 లక్షల కోవిషీల్డ్ డోసులు పంపండి: కేంద్రానికి హరీశ్ రావు లేఖ
హైదరాబాద్: రాష్ట్రంలో డిమాండ్ కు తగిన మొత్తంలో కరోనావైరస్ టీకా డోసులు అందుబాటులో లేవని పేర్కొంటూ తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్రానికి తక్షణమే 50 లక్షల కోవిషీల్డ్ డోసులు పంపాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
వ్యాక్సినేషన్ విషయంలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని ఈ సందర్భంగా హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రంలో 106 శాతం మొదటి డోసు, 104 శాతం రెండో డోసు పంపిణీ చేసినట్లు వివరించారు. ఇక 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం తొలి స్థానంలో ఉందని తెలిపారు.
Recommended Video

మరోవైపు, ప్రికాషనరీ(బూస్టర్) డోస్ కోసం రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించినట్టు హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రంలో డిమాండ్ మేరకు ప్రతిరోజు 3 లక్షల డోసులు ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నా.. వ్యాక్సిన్ కొరత వల్ల రోజుకు కేవలం 1.5 లక్షల డోసులు మాత్రమే ఇవ్వగలుగుతున్నట్టు కేంద్రానికి వివరించారు.

ప్రస్తుత డిమాండ్ మేరకు వ్యాక్సిన్ సరఫరా కావడం లేదన్న మంత్రి.. రాష్ట్రంలో కేవలం 2.7 లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వెంటనే 50 లక్షల కొవిషీల్డ్ డోసులను రాష్ట్రానికి పంపాలని కేంద్రాన్ని కోరినట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు.
ఇంటింటికీ జాతీయ జెండా
దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు బాజాభజంత్రీలతో ఇంటింటికి తిరుగుతూ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భారతదేశ కీర్తిని దశదిశలా వ్యాపించేలా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికి తిరుగుతూ జాతీయ జెండా ప్రాముఖ్యాన్ని వివరిస్తున్నారు.












Click it and Unblock the Notifications