విషాదం: బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి శాన్వి మృతి
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. శాలిగౌరారం మండలం వెల్లాల గ్రామంలో సోమవారంనాడు నిమ్మ తోటలో ఆడుకుంటోన్న శాన్వి అనే మూడేళ్ల చిన్నారి బోరుబావిలో పడిపోయింది.

సంఘటనా స్థలానికి 108 సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోరు బావికి సమాంతరంగా జేసీబీతో తవ్వకం చేపట్టారు. చిన్నారికి పైపు ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు.

నిమ్మతోటలో బావి పూడిక తీసేందుకు వచ్చిన శాన్వి తల్లిదండ్రులు పాపను వదిలేసి పనులు చేసుకుంటున్నారు. ఈ సమయంలో చిన్నారి శాన్వి ఆడుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న బోరు బావిలో పడింది. బోరుబావి 25 అడుగుల లోతు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

బోరుబావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి శాన్వీ మృతి చెందింది. 12 గంటలపాటు సహాయక చర్యలు కొనసాగాయి. నిన్న తోటలో ఆడుకుంటూ వెళ్లిన శాన్వీ బోరుబావిలో పడింది. బోరుబావికి సమాంతరంగా 25 అడుగుల లోతు వరకు అధికారులు గుంత తవ్వారు.
శాన్వీ మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో శాన్వీ తల్లిదండ్రులు స్వామి, సుస్మితలు శోకసంద్రంలో మునిగారు. శాన్వీ స్వస్థలం నల్గొండ మండలం దీపకుంట అని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications