మోహన్ బాబు సన్మాన సభలో చిరు గురించి..., 'రాయలసీమ వాడినని...'(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు, పార్లమెంటు సభ్యుదు శతృఘ్ను సిన్హా చిరంజీవి పేరును ప్రస్తావించారు. రజనీకాంత్, అమ్రీష్‌పురి, మోహన్‌బాబు, చిరంజీవి తామంతా ఒక్క చెట్టు పక్షులమని ఆయన చెప్పారు.
దాసరినారాయణరావు, మోహన్‌బాబు తెలుగు పరిశ్రమ దిగ్గజాలని, అయితే గురుశిష్యులు ఇద్దరూ ఎవరికి వారే సాటి అని కూడా ప్రశంసిం్చారు. సలాం టు తెలంగాణ.. ప్రణామ్ టు ఆంధ్రప్రదేశ్.. అంటూ తన ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తీయని తెలుగు భాష, మహా నటుడు ఎన్టీఆర్ మాట్లాడిన భాష తాను మాట్లాడలేకపోవడం బాధగా ఉందన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటిని కూడా తాను సొంత రాష్ట్రాలుగా భావిస్తానని చెప్పారు. గురువారం రవీంద్రభారతిలో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు 72వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి-శృతిలయ స్వర్ణకంకణాన్ని ప్రముఖ నటుడు మోహన్‌బాబుకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

నాకెంతో అప్తులు...
దాసరి, మోహన్‌బాబు తనకు అత్యంత ఆప్తులని శతృఘ్ను సిన్హా చెప్పారు. వీరద్దరూ ఇక్కడ పుట్టడం తెలుగు పరిశ్రమకు గర్వకారణం అన్నారు.

నిలువెత్తు ఉదాహరణ...
కృతజ్ఞత అనేపదానికి నిలువెత్తు ఉదాహరణ మోహన్‌బాబు అని దర్శకరత్న దాసరి నారాయణ రావు అన్నారు. ఎంతోమందికి నటులుగా, దర్శకులుగా అవకాశాలు ఇచ్చానని, అయితే అందరూ ఇంతగా తనను అభిమానించలేదన్నారు. ద్రోణాచార్యుడికి అర్జునిడిలా తనకు మోహన్‌బాబు అని దాసరి అన్నారు.

విలక్షణ నటుడు మోహన్ బాబు
హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అందరి మెప్పును పొందిన విలక్షణ నటుడు మోహన్‌బాబు అని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీినివాస రావు అన్నారు. విద్యారంగంలో మోహన్ బాబు చేస్తున్న సేవలు గొప్పవని, సినీ పరిశ్రమ అనగానే గుర్తొచ్చే పేరు దాసరి అని అన్నారు.

జన్మను ప్రసాదించారు....
తనకు జన్మను ప్రసాదించిన తండ్రి దాసరి అని మోహన్ బాబు అన్నారు. ఒక జత చెప్పులు, రెండు జతలబట్టలతో ఉన్న నన్ను ఈస్థాయికి తీసుకొచ్చిన ఘనత దాసరిదేనన్నారు.

ఇలా అన్నారు...
రాయలసీమ వాడివి నీకు భాష రాదన్నవారు చాలామంది ఉన్నారని, ఎన్టీఆర్ తర్వాత డైలాగు చెప్పాలంటే మోహన్‌బాబే అనే స్థాయికి దాసరి తీసుకొచ్చారని మోహన్ బాబు అన్నారు.

గురువు దాసరి...
గురువు దాసరిని కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఇలాగే గౌరవిస్తానని మోహన్ బాబు అన్నారు. దాసరి పేరుతో స్వర్ణకంకణం అందుకోవడం పూర్వజన్మసుకృతం అన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కళలను ప్రోత్సహించాలన్నారు.

తెలంగాణలో...
దాసరి గొప్ప దర్శకుడు అయితే మోహన్‌బాబు అద్భుత నటుడు సభాధ్యక్షుడిగా వ్యవహరించిన ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి అని అన్నారు.

ఉత్తమ వ్యక్తి కూడా...
మోహన్‌బాబు గొప్ప నటుడే కాదు గొప్ప వ్యక్తి నటుడు ఆర్ నారాయణ ముూర్తి అన్నారు. అన్నారు. మోహన్‌బాబు రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ప్రకటించడం కాదు వచ్చేయాలి, వచ్చి గెలవాలి, గెలిచి సేవ చేయాలని అన్నారు.

నేను భీముడ్ని...
ద్రోణాచార్యుడు దాసరి, అర్జునుడు మోహన్‌బాబు అయితే తాను భీముడిని అని అన్నారు.నటులు నరేష్, కోట శ్రీనివాసరావు, గిరిబాబు, మంచు మనోజ్, మంచులక్ష్మి, జేబీ.రాజు, ఆమని తదితరులు పాల్గొన్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications