షాకింగ్ వీడియో: నిజామాబాద్ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో అపచారం!!
నిజామాబాద్ జిల్లాలోని ఆలయంలో అపచారం జరిగింది. నిజామాబాద్ జిల్లా నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి జరగాల్సిన అన్ని సేవలు, అన్ని ఆలయ కార్యక్రమాలు సజావుగా జరగాల్సిన చోట, అన్ని ధార్మిక కార్యక్రమాలు సజావుగా జరిపించవలసిన ఈవోనే అపచారానికి పాల్పడ్డారు. ఆయన చేసిన పని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర స్వామి ఆలయం మహా మహిమాన్వితం. అయితే ఇటీవల నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి అనంతరం స్వామివారి పుష్కరిణిలో విగ్రహాలకు అభిషేకం చేస్తున్న క్రమంలో ఆలయ ఈవో వేణు స్వామివారి పవిత్రమైన స్వామి వారి పుష్కరిణిలో ఈత కొట్టారు.

ఒకపక్క వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి అభిషేకం నిర్వహిస్తుంటే ఆలయ ఈవో గా ఆ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ఉన్న వేణు పుష్కరిణిలో ఈతకొడుతూ కనిపించారు. అర్చకులు పుష్కరిణిలో ఈత కొట్టకూడదని ఆయనకు చెప్పినప్పటికీ ఆయన వినిపించుకోకుండా ఈత కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీనిపై స్వామి వారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ఈవో గా ఉండి బాధ్యతారాహిత్యంగా, స్వామివారికి అభిషేకం జరుగుతున్న సమయంలో ఆలయ కోనేరులో ఈత కొట్టడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఒకపక్కన స్వామికి అభిషేకం జరుగుతుంటే మరో పక్కన ఈతకొడుతూ పుష్కరిణిలో నీటిని అపవిత్రం చేశారని ఈవో వేణు పై మండి పడుతున్నారు. నీలకంఠేశ్వర స్వామి ఆలయ ఈవోపైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications