విషాదం: పెద్దచెరువులో దూకి ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య?
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి పెద్ద చెరువులో దూకి బిక్కనూరు మండలం ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారితోపాటు నిఖిల్ అనే మరో వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
మృతులకు సంబంధించిన పలు ఆనవాళ్లు చెరువు వద్ద లభించడంతో చనిపోయింది వారేనని పోలీసులు భావిస్తున్నారు. కారుతోపాటు నిఖిల్ చెప్పులు చెరువు వద్ద గుర్తించారు. సుమారు ఐదు గంటలకుపైగా ఎస్ఐ సాయికుమార్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. కాగా, పెద్ద చెరువులోని మృతదేహాలను వెలికి తీసేందుకు బుధవారం అర్ధరాత్రి వరకు పోలీసులు, సహాయక బృందాలు గాలింపు చేపట్టాయి.

మహిళా కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. సాయికుమార్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. అయితే, వీరంతా ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనేది ఇప్పటి వరకు తెలియరాలేదు.
యాసిడ్ తాగి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్ నగర పరిధిలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ప్రేమ వేధింపులు భరించలేక ఓ డిగ్రీ విద్యార్థిని యాసిడ్ తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. న్యూభవానీనగర్‌కు చెందిన పూర్ణిమ అనే యువతి మంగళవారం సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి రాానే యాసిడ్ తాగి ఆత్మహత్యాత్నం చేసింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆమెను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె బుధవారం మృతి చెందింది.
కాగా, ప్రేమ పేరుతో నిఖిల్ అనే యువకుడు వేధించేవాడని, అతని వేధింపులు భరించలేకే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింని పూర్ణిమ తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జవహర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ కుమార్తె మరణానికి కారణమైన యువకుడ్ని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పడంతో వారు తమ ఆందోళనను విరమించారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications