సచివాలయంలో నకిలీ జీవో స్కామ్: నిందితులు వీరే
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో చోటు చేసుకున్న నకిలీ జీవో కుంభకోణం కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. వారిని సుధాకర్, శివప్రసాద్, అశోక్, నాగరాజు, చంద్రకాంత్, ఎం రమేష్‌లుగా గుర్తించారు. వారిని పోలీసులు శనివారంనాడు కోర్టులో హాజరు పరిచారు. సచివాలయంలోని ఆర్థిక శాఖ నుంచి నకిలీ జీవోలు విడుదలైనట్లు శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
తెలంగాణ సచివాలయంలో నకిలీ జీవోల స్కామ్ శుక్రవారం బయటపడింది. తెలంగాణ సచివాలయంలోని ఆర్థిక శాఖ నుంచి నకిలీ జీవోలు జారీ అయినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో హైదరాబాద్ నగర నేర పరిశోధక బృందం (సిసిఎస్) పోలీసులు ఆరుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాధితులు సిసిఎస్ పోలీసులను ఆశ్రయించడంతో కుంభకోణం వెలుగు చూసింది.

నిరుద్యోగులను నిందితులు సచివాలయంలో ఇంటర్వ్యూలు కూడా చేసినట్లు తాజాగా తెలిసింది. నకిలీ జీవోలతో ఆ ఆరుగురు నిందితులు కూడా నిరుద్యోగులను బురడీ కొట్టించారు. ఈ సంఘటన వెలుగులోకి రావడం తీవ్ర సంచలనం కలిగించింది.
చెక్‌పోస్టులపై ఎసిబి దాడులు
మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆలంపూర్ చెక్‌పోస్టుపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో లక్షా 8 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఎఎంవిఐ అమర్నాథ్‌పై అధికారులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications