SLBC టన్నెల్ ప్రమాదం: రంగంలోకి రోబోలు.. 18వరోజు రెస్క్యూ ఆపరేషన్ ఇలా!
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పైకప్పు కూలి 8మంది దుర్మరణం పాలైన సంఘటనలో వారి ఆచూకీ కనిపెట్టడానికి రెస్క్యూ బృందాలు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటివరకు సొరంగం నుండి ఒక మృతదేహాన్ని బయటకు తీసుకురాగా, మరో ఏడుగురి ఆచూకీ కనిపెట్టడం కోసం సహాయక బృందాలు, సింగరేణి కార్మికులు యుద్ధప్రాతిపదికన పని చేస్తున్నారు. గల్లంతైన కార్మికుల మృతదేహాల కోసం టన్నెల్ లోపల రోబోలను రంగంలోకి దించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
టన్నెల్ లో కొనసాగుతున్న సహాయక చర్యలు
దీంతో నేడు రోబోలతో రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. గత 18రోజులుగా ఎస్ఎల్బీసీ టన్నెల్ లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. సొరంగం లోపల పైకప్పు కూలిన ప్రాంతంలో విరిగిపడిన టన్నెల్ బోరింగ్ మిషన్ సహాయక చర్యలకు అడ్డుగా ఉండడంతో రైల్వే సిబ్బంది దానిని కట్ చేసి విడిభాగాలను బయటకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తం 1500టన్నుల బరువున్న ఈ మెషిన్ ను కట్ చేసి బయటకు తీసుకురావడం పెద్ద టాస్క్ గా మారింది.

కొనసాగుతున్న రెస్క్యూ టీమ్ తవ్వకాలు
ఇక D1, D2లో మృతదేహాల ఆచూకీ కోసం ర్యాట్ హోల్ మైనర్లు, సింగరేణి కార్మికులు తవ్వకాలను జరుపుతున్నారు. ఇక గల్లంతైన కార్మికులను గుర్తించడంలో ప్రస్తుతం పురోగతి కనిపిస్తుంది. స్నిప్పర్ డాగ్స్ తో పాటు, కేరళ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన క్యాడవర్ డాగ్స్ మృతుల ఆడవాళ్లను గుర్తించాయి. జిపిఆర్ తో పాటు డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో రెస్క్యూ టీమ్ తవ్వకాలు జరుపుతున్నారు.
ఒక్క మృతదేహం వెలికితీత
16రోజుల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఒక మృతదేహం లభ్యమైంది. మృతుడిని ర్యాబిన్స్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు. అతను పంజాబ్లోని చీమకలాన్ ప్రాంతానికి చెందినవాడు. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన చోటే గురు ప్రీత్ మృతదేహం లభ్యమయింది. 12 గంటలపాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆదివారం సాయంత్రం మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించారు.పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పంజాబ్ కు పంపించారు.
18 రోజులు కావడంతో శరీరాలు కుళ్ళిపోయిన దుర్వాసన
ప్రస్తుతం జిపిఆర్ఎస్ గుర్తించిన ఐదు ప్రాంతాలలో కొన్నిచోట్ల తవ్వకాలు జరిపినా ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదు. డాగ్స్ గుర్తించిన ప్రాంతాలలో తవ్వకాలు జరుపుతుంటే మృతదేహాలకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడుతున్నాయి. 18 రోజులు కావడంతో శరీరాలు కుళ్ళిపోయిన దుర్వాసన వస్తుండడంతో అదే చోట మృతదేహాలు ఉన్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన తవ్వకాలు జరుపుతున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఎప్పటి వరకు మృతదేహాలను వెలికి తీస్తారు అనేది తెలియాల్సి ఉంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications