సూర్యాపేటలో విషాదం: పెళ్లైన ఆరోరోజే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
హైదరాబాద్: కార్తీక స్నానం కోసం కృష్ణానదిలోకి దిగిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ప్రమాదవశాత్తూ మునిగిపోవడంతో సూర్యాపేటలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, సూర్యాపేటకు చెందిన కనపర్తి మహేశ్(50), మేనల్లుడు మేగరాజు ప్రశాంత్ (27)తో కలిసి అత్తగారి గ్రామమైన నల్గొండ జిల్లా మునగాలకు బుధవారం వెళ్లారు.
కార్తీకపౌర్ణమి సందర్భంగా మునగాలలో నాగార్జునసాగర్ హెడ్‌రెగ్యులేటర్ వద్ద పుణ్యస్నానాలు చేసేందుకు నీటిలోకి దిగారు. స్నానం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గట్టిగా కేకలు వేయడంతో ఇది గమనించిన స్థానికులు నీటిలో కొట్టుకుపోతున్న ప్రశాంత్‌ను రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు.

మహేశ్ ఆచూకీ మాత్రం లభించలేదు. అప్పటికే అపస్మారక స్థితికి చేరిన ప్రశాంత్‌ను అంబులెన్స్‌లో కోదాడ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ప్రశాంత్‌కు ఈ నెల 19న వివాహమైంది. మహేశ్ గల్లంతవడం, ప్రశాంత్ మృతి చెందడంతో బంధువుల ఇంట్లో రోదనలు మిన్నంటాయి.
కాగా ప్రశాంత్ ఆస్టేలియాలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లి అయిన ఆరు రోజులకే ప్రశాంత్ మృత్యువాతపడడంతో వధువు కుటుంబసభ్యుల పరిస్థితి దయనీయంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications