కేసీఆర్ ఆపరేషన్: సోనియా తీవ్ర ఆగ్రహం, గుత్తా కొత్త ట్విస్ట్
న్యూఢిల్లీ: తెలంగాణాలో కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీరుపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులు, మాజీ ఎంపీలు తెరాసలో చేరుతుంటే ఉత్తమ్ చోద్యం చూస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
పార్టీలో గ్రూపులను అదుపు చేయలేకపోతున్నారని, ఎమ్మెల్యేల ఫిరాయింపులలోను ఉత్తమ్ నిలువరించలేకపోతున్నారని అధిష్ఠానం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పార్టీలో నాయకులు పరస్పరం కలహించుకోవడం, మరోవైపు నేతలు పార్టీని వీడి తెరాసలో చేరటాన్ని సోనియా సీరియస్‌గా తీసుకున్నారు.
ఈ మేరకు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్‌ను హైదరాబాద్‌కు వెళ్ళి ఉత్తమ్‌తో, మిగతా నాయకులతో చర్చించాల్సిందిగా ఆదేశించారు. దిగ్విజయ్ సింగ్ ఈ నెల 15న హైదరాబాద్‌కు రానున్నారు.

అదే రోజున టి.పిసిసి సమన్వయ కమిటీ సమావేశం గాంధీ భవన్‌లో జరగనుంది. ఈ సమావేశంలో దిగ్విజయ్ సింగ్ పాల్గొంటారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో కూడా ఆయన చర్చించి అధిష్ఠానానికి నివేదిక సమర్పిస్తారు.
గుత్తా ట్విస్ట్
ఇదిలా ఉండగా, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గుత్తా తనకు అటువంటి ఆలోచన ఏదీ లేదని చెబుతుండటం ట్విస్ట్. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెరాసలో చేరనున్నట్లు ప్రచారం జరగగాడ.. దానిని ఆయన తీవ్రంగా ఖండించారు.
పార్టీలో చివరి వరకూ ఉండేది తానేనని ఘంటాపథంగా చెబుతున్నారు. మరోవైపు, నల్గొండ జిల్లా, కరీంనగర్ జిల్లాల నేతల మధ్య కోల్డ్‌వార్ జరుగుతుండడం, పార్టీ రాష్ట్ర నాయకత్వం వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం తెలిసిందే.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications