ఆలయంలో చెత్తబుట్టలకు పూలు కట్టి ప్రత్యేక పూజలు, దేవుడు కూడా షాకయ్యే ఘటన ఎక్కడో తెలుసా !!

చేసేది చిన్న కార్యక్రమమైనా పెద్ద హడావుడి చేసే ప్రజా ప్రతినిధులు లేకపోలేదు. తెలంగాణా రాష్ట్రంలో అటువంటి నాయకులు కోకొల్లలు. అప్పట్లో ఓ మంత్రివర్యులు మరుగుదొడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన విషయం తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ మర్చిపోలేదు. ఇక ఇప్పటికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు చేసే చిన్న చిన్న కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్న దాఖలాలు అనేకం ఉన్నాయి. ఇటీవల ఓ ఎమ్మెల్యే పల్లె ప్రగతి కార్యక్రమంలో మరుగుదొడ్డి కడిగి వార్తల్లో నిలిచారు.

ప్రజాప్రతినిధులా మజాకా ... ప్రచారం కోసం హడావిడి

ప్రజాప్రతినిధులా మజాకా ... ప్రచారం కోసం హడావిడి

ఇక ప్రజా ప్రతినిధుల ప్రచారం ఎలా ఉంటుందంటే ఉదాహరణకు రోడ్డు శాంక్షన్ అయితే రోడ్డు మంజూరు చేయించామని ఆ రోడ్డు వద్దకు వెళ్లి కొబ్బరికాయలు కొట్టి హడావిడి చేయడం, ఆ తర్వాత రోడ్డు పనులు ప్రారంభానికి ముందు మరోమారు హడావిడి, రోడ్డు పూర్తయిన తరువాత ఇంకోసారి ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఇలా ఒక్క రోడ్డు కోసం మూడు నాలుగు సార్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునే రాజకీయ నాయకులు ఎంతో మంది ఉన్నారు. అంతెందుకు కరోనా మహమ్మారి ప్రబలంగా వ్యాప్తి చెందిన సమయంలో సాక్షాత్తూ తెలంగాణ మంత్రులు శానిటైజేషన్ పనులను పర్యవేక్షించడానికి వెళ్లి, తామే స్వయంగా రోడ్లపై శానిటైజేషన్ చేసి వార్తల్లో నిలిచారు.

 సిద్ధిపేట మున్సిపాలిటీ పరిధిలో చెత్తబుట్టల ఏర్పాటు కూడా స్పెషల్ ఈవెంట్

సిద్ధిపేట మున్సిపాలిటీ పరిధిలో చెత్తబుట్టల ఏర్పాటు కూడా స్పెషల్ ఈవెంట్

అదలా ఉంటే తాజాగా ఓ మున్సిపాలిటీ పరిధిలో ప్రజా ప్రతినిధులు చెత్త బుట్టలు ఏర్పాటు చేసినందుకు చేసిన హంగామా అందరిని విస్తుపోయేలా చేసింది. సాక్షాత్తు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఏదైనా సాధ్యమే భావనకు ఈ ఘటన అద్దం పడుతుంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి దేవస్థానం, సంతోషి మాత దేవస్థానం, కోటిలింగేశ్వర స్వామి దేవస్థానాలలో చెత్త బుట్టలను ఏర్పాటు చేశారు. చెత్త బుట్టలను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా వారు నిర్వహించిన తీరు అందరినీ నవ్వుకునేలా చేస్తుంది.

 చెత్త బుట్టలకు పూజలు .. వాటికి భక్తితో నమస్కారం

చెత్త బుట్టలకు పూజలు .. వాటికి భక్తితో నమస్కారం


దేవాలయాలలో చెత్త బుట్టలను ఏర్పాటు చేసిన క్రమంలో మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్ తో పాటు అర్చకులు చెత్త బుట్టల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక చెత్త బుట్టలను ప్రారంభించటానికి వాటిని చక్కగా పూలతో డెకరేట్ చేసి, మామిడి తోరణాలు కట్టి, బుట్టెడు బంతిపూలు పోసి, ఒక పావుగంట పాటు మంత్రాలు చదివి పూజాదికాలు నిర్వహించి , కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు అందరూ అత్యంత భక్తిభావంతో చెత్త బుట్టల వద్ద నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు ప్రతి ఒక్కరిని విస్మయానికి గురిచేసింది.

అందరూ నవ్వుకునేలా .. షాక్ అయ్యేలా చెత్తబుట్టలకూ హంగామా

అందరూ నవ్వుకునేలా .. షాక్ అయ్యేలా చెత్తబుట్టలకూ హంగామా

ఏది ఏమైనా కొత్త చెత్త బుట్టల ఏర్పాటు కార్యక్రమం అటుంచితే అత్యంత శ్రద్ధతో, భక్తి భావనతో చెత్త బుట్టలకు కూడా పూజలు నిర్వహించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రజా ప్రతినిధులు తాము చేసిన కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలోనే చెత్తబుట్ట కు ప్రత్యేక పూజలు చేస్తున్న సీన్ ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇది విన్న వాళ్ళు నవ్వుకునేలా చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+