అనుమానాస్పద స్థితిలో విద్యార్ధి మృతి: యాజమాన్యమే కారణమంటూ ఆందోళన, రాస్తారోకో?
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వూడూర మండలం, మన్నెగూడలో ఉన్న కేశవ రెడ్డి స్కూలులో దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్ధి నవీన్ గౌడ్ (14) శనివారం రాత్రి అనారోగ్యానికి గురై వికారాబాద్ అసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
బాలుడిని పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతిచెందినట్లు పేర్కొన్నారు. దీంతో విషయం తెలుసుకున్న విద్యార్ధి తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. నవీన్ మృతికి కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలంటూ బీజపూర్-హైదరాబాద్ హైవేపై విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు.

పాఠశాల ఫర్నీచర్, అద్దాలను విద్యార్ధి సంఘాలు ధ్వంసం చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే విద్యార్థి నవీన్ చనిపోయాడంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.
శనివారం సాయంత్రం ఛాతి నొప్పి వస్తుందని చెప్పినప్పుడే ఆసుపత్రికి తరలించి ఉంటే నవీన్ మృతి చెందేవాడు కాదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవీన్ మృతిపై దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications