'ఈ ఏడాది దేశానికి, రాష్ట్రానికి విపత్కర పరిస్థితులు'

హైదరాబాద్: ఈ ఏడాది దేశానికి, రాష్ట్రానికి విపత్కర పరిస్థితులు తప్పవని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శుక్రవారం సందర్శించారు.

ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రజలు, రాజకీయ నాయకులు విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు.

Swaroopananda Swamy controversial comments on new year

ఈ ఏడాది భూకంపాలు, ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉందన్నారు. గతంలో కూడా స్వరూపానందేంద్ర స్వామి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తప్పదని ఇటీవల విశాఖపట్నంలో చెప్పారు. గ్రహాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు.

ఆయన చెప్పినట్టుగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. అంతేకాదు గతంలో భగవంతుడి ఆశీస్సులు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు అధికారంలో ఉండదని, పడిపోతుందని అన్నారు. ప్రజలను సుఖశాంతులతో పాలించాలన్న ఆలోచనను ప్రభుత్వం చేయడం లేదన్నారు. అయితే ఇది జరుగుతుందో లేదో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+