చెత్తతో విద్యుత్: కెసిఆర్‌తో స్వీడన్ డెలిగేట్స్(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పోగయ్యే చెత్త, సేంద్రియ వ్యర్థాలతో ప్రతిరోజూ 108 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చునని స్వీడన్‌కు చెందిన బిజినెస్, గ్రీన్ టెక్నాలజీ ప్రమోషన్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. బుధవారం వారు ముఖ్యమంత్రి కెచంద్రశేఖర్‌రావును కలిసి ఈ విషయాలను వివరించారు.
స్వీడన్ కంపెనీకి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ రామన్ నాగరాజన్, కన్సల్టెంట్ డయానా మిల్లర్స్ డాల్సియో, వేస్ట్ మేనేజ్‌మెంట్ నిపుణులు టోవె ఐర్‌బ్లాడ్‌ల బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు.
ఈ సందర్భంగా చెత్త, సేంద్రియ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి వారు సమర్పించారు. ఇలాంటి ప్రాజెక్టులకు ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు ఆర్థిక సాయం కూడా అందిస్తుందని వివరించింది.
చెత్త, సేంద్రియ వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణలో ప్లాంట్లను ఏర్పాటు ప్రతిపాదనలతో ఈ కంపెనీ ముందుకు వచ్చింది. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సిఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగరావు, అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

కెసిఆర్‌తో భేటీ
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పోగయ్యే చెత్త, సేంద్రియ వ్యర్థాలతో ప్రతిరోజూ 108 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చునని స్వీడన్‌కు చెందిన బిజినెస్, గ్రీన్ టెక్నాలజీ ప్రమోషన్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

కెసిఆర్‌తో భేటీ
బుధవారం వారు ముఖ్యమంత్రి కెచంద్రశేఖర్‌రావును కలిసి ఈ విషయాలను గణాంకాలతో వివరించారు.

కెసిఆర్‌తో భేటీ
స్వీడన్ కంపెనీకి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ రామన్ నాగరాజన్, కన్సల్టెంట్ డయానా మిల్లర్స్ డాల్సియో, వేస్ట్ మేనేజ్‌మెంట్ నిపుణులు టోవె ఐర్‌బ్లాడ్‌ల బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు.

కెసిఆర్‌తో భేటీ
ప్రతి 1500 మెట్రిక్ టన్నుల చెత్త, సేంద్రియ వ్యర్థాలతో 36 మెగావాట్ల చొప్పున విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చునని, ఈ లెక్కన హైదరాబాద్ నగరంలో ప్రతిరోజూ పోగయ్యే 4500 మెట్రిక్ టన్నుల చెత్త, సేంద్రియ వ్యర్థాలతో 108 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చునని తెలిపారు.












Click it and Unblock the Notifications