వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు ఏం సాధిస్తారు: తలసాని సంచలన వ్యాఖ్యలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

చంద్రబాబుని ఎత్తిపొడుస్తున్న తలసాని....!

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏం సాధిస్తారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. శనివారంనాడు ఆయన అసెంబ్లీ లాబీలో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

విభజన హామీలపై పోరాటం చేయకుండా ప్రజలను అన్ని పార్టీలూ మోసం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఎపిది న్యాయమైన కోరిక అని తమ పార్టీ ఎంపీలు జితేందర్ రెడ్డి, కవిత చెప్పినట్లు ఆయన చెప్పారు. ఎపి ప్రజలు ఆపరేషన్లను నమ్మే స్తితిలో లేరని ఆయన అన్నారు.

పోరాట స్ఫూర్తి లేదు

పోరాట స్ఫూర్తి లేదు

ఆంధ్రప్రదేశ్ నాయకులకు పోరాట స్ఫూర్తి లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎెపి ఎంపీలు రాజీనామాలు చేస్తే దేశం దృష్టిని ఆకర్షిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదననెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

కేసీఆర్ నాయకత్వం వహిస్తారు

కేసీఆర్ నాయకత్వం వహిస్తారు

దేశంలో ఎక్కడ సమస్యలున్నా తమ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు నాయకత్వం వహిస్తారని తలసాని చెప్పారు. ఏపి ప్రజలు కూడా కోరుకుంటే నాయకత్వానికి కేసిఆర్ సిద్ధమేనని అన్నారు.

టిడిపి సెల్ఫ్ గోల్ చేసుకుంటోంది..

టిడిపి సెల్ఫ్ గోల్ చేసుకుంటోంది..


ఎపిలో టిడిపి సెల్ఫ్ గోల్ చేసుకుంటోందని తలసాని అన్నారు. చంద్రబాబు ఎన్డీఎ నుంచి వైదొలిగిన తర్వాత అవిశ్వాసం పెట్టడం వల్ల ప్రయోజనం లేదని ఆయన అన్నారు. కలిసి ఉన్నప్పుడు ప్రశ్నించి ఉంటే ఉపయోగం ఉండేదని అన్నారు.

చంద్రబాబుకు ఎందుకు

చంద్రబాబుకు ఎందుకు

నిన్నటి వరకు టిడిపి, బిజెపి కలిసే ఉన్నాయని తలసాని అన్నారు. నాలుగేళ్ల నుంచి ప్రత్యేక హోదాను చంద్రబాబు ఎందుకు లేవనెత్తలేదని ఆయన అడిగారు. వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి ఎవరిని కలిస్తే చంద్రబాబుకు ఎందుకని అడిగారు. ఎపి ప్రజల ఆవేదన చసి తాను మాట్లాడాల్సి వస్తోందని అన్నారు.

English summary
The Telangana minister Talasani SrinivasYadav made comments against Andhra Pradesh CM and Telugu Desam party chief Nara Chnadrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X