రేవంత్! పెళ్లికి డబ్బులివ్వలేదు, బాబుపై సై: తలసాని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభ బుధవారం నాడు హాట్ హాట్‌గా సాగింది. శాసన సభ లాబీల్లో నేతల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది. టీడీపీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి పైన తెరాస సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన లాబీల్లో తలసాని మాట్లాడుతూ... రేవంత్‌ది మురికి నోరు అని, ఆయన తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
అలాంటి వారికి వేరేలా సమాధానం చెప్పవలసి ఉంటుందన్నారు. తన ఓపికకూ హద్దు ఉంటుందని, తన పిల్లల పెళ్లికి, పార్టీ కార్యక్రమాల కోసం చంద్రబాబు డబ్బు పంపించారంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. అవన్నీ పూర్తిగా తానే చేసుకున్నానని చెప్పారు.
దీని పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సన్నాసి అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, అదే మాట తానూ చంద్రబాబును ఉద్దేశించి అనగలనని, కానీ రేవంత్‌లా తాను దిగజారనన్నారు. సనత్ నగర్ నుండి చంద్రబాబు పోటీ చేసినా తాను ఆయన పైన పోటీకి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
రేవంత్ ఇంటి ముట్టడికి యత్నం

రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ఎమ్మార్పీఎస్ నాయకులు బుధవారం యత్నించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పైన రేవంత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నాలుగు రోజుల కిందట ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు రేవంత్ ఇంటిని ముట్టడించి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకా క్షమాపణ చెప్పలేదని బుధవారం మరోసారి ముట్టడించారు.
కాగా, రేవంత్ ఇంటి పైన జరుగుతున్న దాడులు ఎమ్మార్పీఎస్‌వి కావని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఎమ్మార్పీఎస్ ముసుగులో జరుగుతున్న దాడులన్నారు. మాల, మాదిగల పక్షాన పోరాడుతున్న రేవంత్‌కు ఆయా పక్షాలు మద్దతుగా నిలవాలన్నారు. తాము సభలో ఉంటే కేసీఆర్ రంగు బయటపడుతుందనే సస్పెండ్ చేశారన్నారు.












Click it and Unblock the Notifications