హరీష్ మాటేంటి: ప్రశ్నిస్తే అరెస్ట్, రేవంత్ ఫైర్(పిక్చర్స్)

హైదరాబాద్: మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టీ రాజయ్య విషయంలో కనిపించిన అవినీతి తన అల్లుడు హరీష్ రావు శాఖలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కనిపించడం లేదా అని తెలంగాణ టీడీపీ నేతలు గురువారం నాడు ప్రశ్నించారు. మైనింగ్ మాఫియాతో కుమ్మక్కైన మంత్రులను, అధికారులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ, తెలుగునాడు విద్యార్థి సమాఖ్య నాయకులు మైనింగ్ శాఖ ఏడీ కార్యాలయాన్ని ముట్టడించాయి.

పోలీసులు వారిని అరెస్టు చేసి, పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నన్నూరి నర్సిరెడ్డి తదితరులు కేసీఆర్ పైన మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా ఇసుక మాఫియా కుంభకోణంలో అల్లుడు హరీష్, మరో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిల హస్తం ఉందని, వారి పైన కఠిన చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

కాగా, టీడీపీ నేతల అరెస్టు విషయం తెలుసుకున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డిలు పోలీసు స్టేషన్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ నేతలను అరెస్టు చేయించడం అప్రజాస్వామికమన్నారు.

 టీడీపీ

టీడీపీ

మంజీరా నదిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాల్లో మంత్రులు హరీశ్‌ రావు, పోచారం శ్రీనివాసరెడ్డిల పాత్ర ఉందని అక్కడి రైతులు బహిరంగంగా చెబుతున్నారని, అవినీతిపరుల తాట తీస్తానని హెచ్చరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే ఆ ఇద్దరు మంత్రులపై చర్య తీసుకోవాలని తెలంగాణ టీడీపీ డిమాండ్‌ చేసింది.

 టీడీపీ

టీడీపీ

అవినీతికి పాల్పడినందుకే ఉప ముఖ్యమంత్రి రాజయ్యను బర్తరఫ్‌ చేశానంటున్న ముఖ్యమంత్రి... మంత్రులు హరీశ్‌, పోచారంపైనా అదే చర్య తీసుకోవాలని, దళితుడైన రాజయ్యపై ఎంత వేగంగా చర్యలు తీసుకున్నారో ఈ మంత్రులపై కూడా అంతేవేగంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 టీడీపీ

టీడీపీ

గనుల శాఖను చూస్తున్న హరీశ్‌ బంధువులు, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి కుమారుడు కలిసి మంజీరా నదిలో ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారని అక్కడి రైతులు మాకు ఫిర్యాదు చేశారు.

 టీడీపీ

టీడీపీ

ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టాలని పోచారం గతంలో నిజామాబాద్‌ జిల్లాలో అనేకసార్లు ధర్నాలు చేశారని, ఇప్పుడు ఆయన కుమారుడే తవ్వకాల వెనుక ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయని రేవంత్‌ చెప్పారు.

 టీడీపీ

టీడీపీ

ఇంటిలిజెన్స్‌ నివేదికలంటూ.. మీడియాకు లీకులిచ్చి దళితుడైన రాజయ్యను దుర్మార్గంగా బర్తరఫ్‌ చేశారని, కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చిన అవినీతి బాగోతాలపై ఏం చర్యలు తీసుకుంటారో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+