హోమ్ వర్క్ చేయలేదని విద్యార్థినిని హించిన లేడీ టీచర్
హైదరాబాద్: మెదక్ జిల్లా సంగారెడ్డి ప్రభుత్వ స్కూల్లో హోంవర్క్ సరిగా చేయలేదంటూ ఓ టీచర్ విద్యార్థిని చేతులు కమిలిపోయేలా గిల్లింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తొమ్మిదవ తరగతి చదువుతున్న శ్రావణి అనే విద్యార్థికి అదే స్కూల్లో పనిచేస్తున్న ఇంగ్లీష్ టీచర్ ప్రాజెక్టు హోంవర్కు ఇచ్చింది.
హోంవర్క్‌లో తప్పులు ఉన్నాయంటూ టీచర్ విద్యార్థినిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా బాలిక రెండు చేతులను గట్టిగా గిచ్చింది. దీంతో శ్రావణికి తీవ్రమైన నొప్పితో పాటు జ్వరం కూడా వచ్చేసింది. శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా స్కూల్ సెలవు కావడంతో శనివారం విద్యార్థిని తల్లిదండ్రులు స్కూలుకు వెళ్లి ఉపాధ్యాయులతో గొడవకు దిగారు.

పట్టపగలు దోపిడీ
ఇదిలావుంటే, హైదరాబాదులోని నాగోల్ లో దారుణం జరిగింది. కృషీనగర్‌లో పట్టపగలే దోపిడీ జరిగింది. సుశీల అనే మహిళ ఇంట్లో ఇద్దరు దొంగలు చొరబడ్డారు. మహిళను గాయపరిచి చైన్ లాక్కొని దొంగలు పరారయ్యారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. సుశీలను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
టిప్పర్ డ్రైవర్ మృతి
ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మరణిచాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా బొమ్మల రామారాం మండలం పెద్ద పర్వతాపూర్ గ్రామంలో శనివారం జరిగింది. బొమ్మల రామారాం నుంచి హైదరాబాద్ వెళ్తున్న డిసిఎం ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొనండంతో టిప్పర్ డ్రైవర్ కాశిమియా (45) మరణించాడు.












Click it and Unblock the Notifications