వాగుడుకాయ: విద్యార్థి నోటికి ప్లాస్టర్ వేసిన టీచర్
వాగుడుకాయ నోటికి ఓ టీచర్ ప్లాస్టర్ వేయడం వివాదంగా మారింది. తరగతి గదిలో అతిగా వాగుతున్నాడనే కారణంతో టీచర్ ఐదేళ్ల విద్యార్థి నోటికి ప్లాస్టర్ వేసి నోరు మూయించింది.
హైదరాబాద్: వాగుడుకాయ నోటికి ఓ టీచర్ ప్లాస్టర్ వేయడం వివాదంగా మారింది. తరగతి గదిలో అతిగా వాగుతున్నాడనే కారణంతో టీచర్ ఐదేళ్ల విద్యార్థి నోటికి ప్లాస్టర్ వేసి నోరు మూయించింది. ఈ సంఘటన హైదరాబాదులోని పుప్పాలగుడాలో శుక్రవారం చోటు చేసుకుంది.
ఆ సంఘటనపై విద్యార్థి ల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెసేమ్ స్కూల్లో యుకెజి చదువుతున్న విద్యార్థి తోటి విద్యార్థులతో అతి మాట్లాడుతుండడాన్ని స్కూల్ టీచర్ ఆస్రా గుర్తించారు. మాట్లాడొద్దని ఒక్కటికి రెండుమార్లు హెచ్చరించారు.

అయినా విద్యార్థి వినలేదు. దీంతో ఆస్రా ఆ బాలుడి నోటికి ప్లాస్టర్ వేసింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత బాలుడు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. విషయం తెలుసుకోవడానికి బాలుడి తల్లి సౌమ్య పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసింది. అయితే అక్కడి నుంచి ఏ విధమైన ప్రతిస్పందన కూడా రాలేదు.
దాంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీచర్‌పై జువెనైల్ జస్టిస్ యాక్ట్ 82 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు నార్సింగ్ ఇన్‌స్పెక్టర్ రమణ గౌడ్ చెప్పారు.












Click it and Unblock the Notifications