పదో అంతస్థు నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ సమీపంలోని సింగపూర్ టౌన్‌షిప్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. నివాస ప్రాంగణంలోనే పదో అంతస్థు భవనంపై నుంచి దూకి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి దాదాపు ముప్పై ఏళ్ల వయస్సు ఉంటుంది.

రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలంలో సింగపూర్ టౌన్‌షిప్ ఉంది. ఇక్కడ ఉన్న జెన్ ఫ్యాక్ట్ సాఫ్ట్‌వేర్ సంస్థలో అతను పనిచేస్తున్నాడు. అయితే, ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి ఎవరనేది తెలియడం లేదు. అదే సమయంలో ఎందుకు అతను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనేది కూడా తెలియాల్సి ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వివరాలు సేకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications