Telangana Tenth Results 2024: పదో తరగతి ఫలితాలు విడుదల..
తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 91.23 శాతం ఉత్తీర్ణత సాధించారు. పదో పరీక్షల్లో బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణత సాధించి పై చేయి సాధించారు. ఇక బాలురు 89.42 శాతం ఉత్తీర్ణతతో వెనకబడ్డారు. రాష్ట్రంలో 3927 పాఠశాలల్లో 100 శాతం విద్యార్థులు పాసయ్యారు. నిర్మల్ జిల్లా 99 శాతంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది.
వికారాబాద్ 65.10 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ఆరు పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. పదో తరగతి పరీక్షలను మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. ఈ పరీక్షలకు తెలంగాణ వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో బాలికలు 2,50, 433 మంది ఉండగా.. బాలురు 2,70,952 మంది ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2,676 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పదో తరగతి ఆన్ లైన్ మెమోల కోసం https://results.bsetelangana.org/ వెళ్లి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

పరీక్షల్లో ఫెలైన విద్యార్థులకు జూన్ లో సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 3 నుంచి 13 తేదీ వరకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యా శాఖ ప్రకటించింది. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సంబంధింత పాఠశాలల్లో మే 16వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలి.












Click it and Unblock the Notifications