పెథాయ్ తుఫాను ఎఫెక్ట్: ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి పర్యటనకు ఆటంకం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాల్సి ఉంది. అయితే పెథాయ్ తుఫాను, భారీ వర్షాల కారణంగా ఈ సందర్శన కార్యక్రమం వాయిదా పడింది. తుపాను ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.
దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటన మళ్లీ ఎప్పుడు ఉంటుందనే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాత ప్రకటన చేయనున్నారు. కేసీఆర్ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా శనివారం రాష్ట్రంలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం నిర్వహించారు.

ఈ సమీక్షా సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన ఖరారైంది. ప్రాజెక్టుల పనులు అనుకున్నంత వేగంగా సాగడం లేదని ఓసారి తానే స్వయంగా వచ్చి పనులను పరిశీలిస్తానని కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో రేపు కాళేశ్వరానికి వెళ్లాల్సి ఉండగా తుపాను కారణంగా వాయిదా పడింది. కేసీఆర్ తొలి పర్యటనకు అడ్డంకి ఏర్పడటంతో శకునం బాగా లేదా అనే చర్చ సాగుతోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications