Telangana: చేనేత కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్
Telangana: తెలంగాణలో చేనేత కార్మికులకు రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత కార్మికుల రుణమాఫీ పథకానికి రేవంత్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చేనేత కార్మికులకు రూ.33 కోట్ల రుణమాఫీకి ప్రాథమిక అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పథకం ద్వారా ఒక్కో చేనేత కార్మికుడికి రూ.లక్ష వరకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఉన్న రుణ బకాయిలను ప్రభుత్వం మాఫీ చేయబోతోంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గతేడాది సెప్టెంబర్ 9న హైదరాబాద్ లోని జాతీయ చేనేత సాంకేతిక సంస్థ ప్రారంభోత్సవంలో చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలోనే రుణమాఫీపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించి.. తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు చేనేత సంఘాలు, వివిధ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది. ఇదిలా ఉండగా.. గత బీఆర్ఎస్ సర్కారు చేనేత కార్మికులకు 2017 వరకు రుణమాఫీ చేసింది. జిల్లా సహకార బ్యాంకుల నుంచి, జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేసింది.

-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications