అసెంబ్లీ వేదికగా "కాళేశ్వరం ప్రాజెక్టు"పై కాంగ్రెస్ సర్కారు సంచలన నిర్ణయం.. !

తెలంగాణ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఆర్థిక అవకతవకలను విచారించడానికి కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తు కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI)కు అప్పగించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

కాగా అసెంబ్లీలో జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికపై ఆదివారం అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా చర్చ సాగింది. సుమారు 9 గంటలపాలు కాళేశ్వరం కమిషన్‌ నివేదికలోని పలు అంశాలను ప్రస్తావించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో ప్రాజెక్టులో అనేక లోపాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయని స్పష్టంగా ఉందని వెల్లడించారు.

telangana-government-transfer-kaleswaram-project-enquiry-case-to-cbi

మూడు బ్యారేజీల నిర్మాణం సరైన ప్రణాళిక లేకుండా జరిగిందని నివేదిక ఇచ్చినట్టు స్పష్టం చేశారు. నిర్మాణ పనుల్లో డిజైన్ లోపాలు, నాణ్యత పర్యవేక్షణ లోపించడం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను దాచిపెట్టడం వంటి అంశాలను గుర్తించారన్నారు.

కమిషన్ నివేదికలో బయటపడ్డ లోపాలు - సీఎం

అలాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) చేసిన పరిశీలన ప్రకారం.. మేడిగడ్డ బ్యారేజీ విఫలానికి ప్రణాళికలో నిర్లక్ష్యం, డిజైన్ లోపాలు, నాణ్యత నియంత్రణ లోపాలే కారణమని సీఎం తేలిందన్నారు. అందువల్ల నిర్మాణంలో తీవ్రమైన లోపాలు ఏర్పడ్డాయని కూడా గుర్తించారని.. ఈ అంశాలన్నింటిపై లోతుగా, మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని కమిషన్ నివేదికలో స్పష్టం చేసిందని రేవంత్ రెడ్డి వివరించారు.

ఎందుకు సీబీఐ దర్యాప్తు ?

కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాకుండా.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు కూడా పాలుపంచుకున్నాయని తెలిసిందే. వాప్కోస్ వంటి కేంద్ర ఏజెన్సీలు డిజైన్, నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాయి. పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ వంటి ఆర్థిక సంస్థలు నిధులు సమకూర్చాయి. అంతర్రాష్ట్ర అంశాలు కూడా ఉండటంతో ఈ కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించడం అవసరమని కమిషన్ సూచించింది. దీన్నే ఆధారంగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి విచారణ అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. అంచనాలు మార్చి దోచుకున్న వాళ్లందరినీ శిక్షించడానికి విచారణ జరగాలని ఆశిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

అక్బరుద్దీన్ ప్రశ్నలకు సమాధానం..

ఇక చర్చలో ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం రేవంత్ సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా దాదాపు లక్ష కోట్లు వృథా అయ్యాయని బాధ వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు నీటి కోసం పోరాడారని గుర్తు చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై ఇప్పటికే విచారణ జరిపామని.. జస్టిస్ ఘోష్ అనుభవజ్ఞుడైన న్యాయమూర్తి కాబట్టి వివిధ దర్యాప్తు సంస్థల నివేదికలన్నీ ఆయన పరిశీలనకు ఇచ్చామని తెలిపారు. నివేదికను పూర్తిగా చదవకుండా అనవసర ఆరోపణలు చేయవద్దని కూడా సూచించారు. వాస్తవాలు వక్రీకరించి మాట్లాడితే చూస్తూ ఊరుకోలేమని.. సలహాలు, సూచనలు తీసుకునేందుకు నివేదికను ముందుంచామన్నారు.

గత ప్రభుత్వంపై విమర్శలు..

మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు కమిషన్ నివేదికపై కోర్టుకు వెళ్లారని సీఎం రేవంత్ ప్రస్తావించారు. 8బీ, 8సీ కింద నోటీసులు ఇచ్చారని గతంలో వారే కోర్టులో వాదనలు వినిపించారని గుర్తు చేశారు. విద్యుత్ కమిషన్‌పై కూడా కేసీఆర్ కోర్టును ఆశ్రయించారని తెలిపారు. అవినీతి సొమ్మును రికవరీ చేయడానికి SIT, CID, IT, ED లేదా సీబీఐ ద్వారా ఏ మార్గం అనుసరించాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. గత పాలకులు అంబానీ, అదానీ కంటే ఎక్కువ సంపాదించాలని ఆశపడ్డారని విమర్శలు గుప్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+