ఇక స్కూళ్లలోనే విద్యార్ధులకు బ్రేక్ ఫాస్ట్, రోజు వారీ మెనూ ఇలా..!!
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ ఇచ్చిన హామీ మేరకు ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు బ్రేక్ ఫాస్ట్ ఇవ్వనున్నారు. ఈ స్కీమ్ అమలుపై అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌లో అందించే టిఫిన్స్ లిస్ట్‌ను సైతం రెడీ చేశారు. ప్రస్తుతం ఆ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంతోపాటు రాగిజావా అందిస్తున్నారు. ఇక నుంచి బ్రేక్ ఫాస్ట్ కూడా అందించాలని డిసైడ్ అయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్ తమిళనాడు తరహాలో విద్యార్ధులకు ఉదయం సమయంలో పాఠశాలల్లోనే బ్రేక్ ఫాస్ట్ అందించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 24,277 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో 18లక్షల మంది చదువుతున్నారు. ప్రస్తుతం ఆ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంతోపాటు రాగిజావా అందిస్తున్నారు. అయితే, వచ్చే విద్యా సంవత్సరం నుంచి తమిళనాడు రాష్ట్రం తరహాలో విద్యార్థులకు ఉదయాన్నే టిఫిన్ కూడా అందించేలా సర్కార్ నిర్ణయించింది. బ్రేక్ ఫాస్ట్ పథకం అమలుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నిధుల కేటాయింపుపై ప్రతిపాదన లను సిద్దం చేసారు.

ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు రోజుకు ఒక్కొక్కరికి రూ.8, హైస్కూల్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.11 చొప్పున ఖర్చుగా నిర్ణయించారు. విద్యార్థులకు అందించే టిఫిన్స్ వివరాలతో మెనూ ను అధికారులుసిద్ధం చేశారు. మూడు రోజులు రైస్ ఐటెమ్స్ (పొంగల్, కిచిడీ, జీరారైస్), రెండు రోజులు రవ్వ ఐటెమ్స్ (గోధుమరవ్వ, బొంబాయి రవ్వ ఉప్మా) ఇవ్వాలని నిర్ణయించారు. మరోరోజు బోండా ఇవ్వాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ బాధ్యతను ఏజెన్సీలు లేదా ఎన్జీవోలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల ఎన్జీవోలు బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నాయి. వాళ్లు ముందుకొస్తే ఆ ప్రాంతంలో వారికే బాధ్యతలు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications