తెలంగాణలో 69% రిజర్వేషన్లు, ముస్లింలకు 12% రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న బిజెపి

తెలంగాణలో రిజర్వేషన్ల కోటా 69 శాతానికి పెరగనుంది. ముస్లిం రిజర్వేషన్లను నాలుగు నుండి 12 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్లను 6 నుండి 9 శాతానికి పెంచనుంది ప్రభుత్వం.

హైదరాబాద్: తెలంగాణలో రిజర్వేషన్ల కోటా 69 శాతానికి పెరగనుంది. ముస్లిం రిజర్వేషన్లను నాలుగు నుండి 12 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్లను 6 నుండి 9 శాతానికి పెంచనుంది ప్రభుత్వం. ఈ మేరకు ప్రత్యేక మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేసి ఈ ముసాయిదా బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను నెరవేర్చుకొనే ప్రక్రియలో భాగంగా టిఆర్ఎస్ రంగం సిద్దం చేసింది. ముస్లింలకు రిజర్వేషన్లను నాలుగు నుండి 12 శాతానికి పెంచనున్నట్టు ప్రకటించింది.

అయితే మత ప్రాతిపదికన రిజర్వేషన్లను అమలు చేయడాన్ని బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ప్రస్తుతమున్న రిజర్వేషన్లను 4 నుండి 12 శాతానికి పెంచితే ఉద్యమాన్ని చేపట్టనున్నట్టు ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది.

రిజర్వేషన్ల పెంపు అంశానికి సంబంధించిన ముసాయిదా బిల్లులను తయారుచేఇారు. బుదవారం నాడు ప్రత్యేకంగా నిర్వహించే మంత్రివర్గం సమావేశంలో ముసాయిదా బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.

తెలంగాణలో 69% పెరగనున్న రిజర్వేషన్లు

తెలంగాణలో 69% పెరగనున్న రిజర్వేషన్లు

తెలంగాణ ప్రభుత్వం ఎస్ టీ బిసి, ముస్లింలకు రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ముసాయిదా బిల్లులకు బుదవారం నాడు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.ఈ నెల 16వ, తేది నుండి మూడు రోజుల పాటు ప్రత్యేకంగా నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లులపై చర్చించి ఆమోదం తెలపనున్నారు.ఈ రిజర్వేషన్లు పెరిగితే రాష్ట్రంలో 69 శాతానికి రిజర్వేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

తమిళనాడు తరహాలోనే తెలంగాణలో రిజర్వేషన్లు

తమిళనాడు తరహాలోనే తెలంగాణలో రిజర్వేషన్లు

తమిళనాడు రాష్ట్రంలో ఉన్నట్టుగానే తెలంగాణలో కూడ రిజర్వేషన్లు 69 శాతానికి పెరగనున్నాయి. ఎస్ టీ రిజర్వేషన్లను 6 నుండి 9 శాతానికి, ముస్లిం రిజర్వేషన్లను 4 నుండి 12 శాతానికి, బీసీ రిజర్వేషన్లను 29 శాతం నుండి 33 శాతానికి పెంచనున్నారని సమాచారం. నిజానికి ప్రస్తుతం ముస్లింలు బీసీ -ఈ జాబితాలో ఉన్నారు.బీసీలకు 29శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు.అయితే ముస్లింలకు ఇచ్చే 4 శాతం ఇందులోనే ఉంది.ముస్లిం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచనున్నారు.అయితే బీసి రిజర్వేషన్ల నుండి ముస్లిం రిజర్వేషన్లను ప్రత్యేకంగా ఇవ్వనున్నారు. ప్రత్యేక కోటా చేయాలనే ప్రభుత్వం భావిస్తోంది.

.బీసీ రిజర్వేషన్లు 33 శాతానికి పెరుగుదల

.బీసీ రిజర్వేషన్లు 33 శాతానికి పెరుగుదల

ఇప్పటివరకు బీసీల రిజర్వేషన్లలోని 29 శాతంలోనే ముస్లింలు కూడ 4 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి.అయితే ఈ పరిస్థితుల్లో బీసీలకు కేవలం 25 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే రిజర్వేషన్ల కోటా పెంచడంతో పాటు ముస్లింలకు ప్రత్యేక కోటా కింద రిజర్వేషన్లు కల్పించడంతో బీసీల రిజర్వేషన్లు 25 శాతం(ముస్లింలకు ఇచ్చే నాలుగు శాతం మినహయిస్తే) నుండి 33 శాతానికి పెరగనున్నాయి.ఈ లెక్కన బీసీలకు 8 శాతం రిజర్వేషన్లను పెంచినట్టుగా ఉంటుంది.తమిళనాడులో కూడ రిజర్వేషన్లు 69 శాతం వరకు ఉన్నాయి.

రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి

రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి

తమిళనాడు తరహలో రిజర్వేషన్లను 69 శాతానికి పెంచేందుకు రాజ్యాంగ ప్రకారంగా రాష్ట్రంలో ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.ఈ మేరకు బుదవారం నిర్వహించే క్యాబినెట్ సమావేశంలో ముసాయిదా బిల్లులకు ఆమోదం తెలపనుంది. ఈ నెల 16 నుండి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం నాడు ముఖ్యమంత్రి కెసిఆర్ గవర్నర్ నరసింహన్ తో సమావేశమయ్యారు.అసెంబ్లీ లో చట్టాలు చేసిన తర్వాత ఈ విషయమై కేంద్రంపై ఒత్తిడి తేవాలని సర్కార్ భావిస్తోంది.

ప్రత్యేక హెరిటేజ్ చట్టం తేనున్న సర్కార్

ప్రత్యేక హెరిటేజ్ చట్టం తేనున్న సర్కార్

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చారిత్రక , పురాతన భవనాలను కూల్చివేయడానికి వీలుగు ప్రత్యేక హెరిటేజ్ చట్టాన్ని తీసుకురానుంది సర్కార్. ఈ మేరకు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చేందుకు సర్కార్ ప్లాన్ చేస్తోంది.మరో వైపు రెండు రాష్ట్రాల మద్య నెలకొన్న సమస్యలపై కూడ చర్చించే అవకాశాలున్నాయి.మరో వైపు ఎస్టీ ల జనాభా రాష్ట్రంలో 9 శాతం ఉంది. అయితే వాల్మీకి, బోయ, కాయితీ లంబాడాలను కూడ చేరిస్తే వారి రిజర్వేషన్లను 12 శాతం వరకు చేయవచ్చని సర్కార్ భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+