మానవత్వం చాటుకున్న కేటీఆర్.. మాతృహృదయంతో తల్లి కిడ్నీ కొడుక్కి..
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. రెండు కిడ్నీలు చెడిపోయి మంచాన పడ్డ నల్లగొండ జిల్లా హాలియాకు చెందిన బాలుడు నాయబ్ రసూల్‌కు అండగా నిలిచారు. ఈ సమస్యను తాను చూసుకుంటానని బాలుడి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. నిమ్స్ ఆస్పత్రి వైద్యులతో సంప్రదించి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు.

14 ఏళ్లకే రెండు కిడ్నీలు పాడైన బాలుడు
ఎప్పుడూ తోటి విద్యార్ధులతో ఆడుతూ, పాడుతూ, చలాకీగా ఎంతో ఉత్సాహంగా ఉండే నల్లొండ జిల్లా హాలియా పట్టణానికి చెందిన 14 ఏళ్ల బాలుడు రసూల్ లాక్‌డౌన్ సమయంలో స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఉన్నట్లుండి మంచం మీద పడిపోయాడు. కంగారుపడ్డ కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు బాలుడికి రకరకాల పరీక్షలు చేయగా అతని రెండు కిడ్నీలు పాడైపోయాయని నిర్ధారించారు. దీంతో రసూల్‌కి ప్రతి మూడు రోజులకు ఒకసారి డయాలసిస్ చేయాలని వైద్యులు చెప్పారు. ఆబాలుడి తల్లిదండ్రులు తమ బిడ్డ ఆరోగ్యం కోసం అందిన చోటల్లా అప్పులు చేశారు. కాగా, డయాలసిస్ చివరిదశ చేసే సమయంలో బాలుడి ఆరోగ్యం మరింత క్షిణించింది. దీంతో రసూల్ తల్లి మాతృహృదయంతో తన కిడ్నీ ఇవ్వడానికి సిద్దమైంది. కానీ కిడ్నీ మార్పిడి కోసం వైద్యులు రూ. 10 లక్షలు ఖర్చు అవుతాయని చెప్పారు. దీంతో ఆ కుటుంబం తమకు ఎవరైనా సాయం చేయాలని వేడుకుంది.
నా కిడ్నీలు ఇస్తా.. నా బిడ్డను కాపాడండి
హాలియాకు చెందిన షేక్ మస్తాన్, మస్తాన్ బీ అనే దంపతులకు ఇద్దరు కుమారులు . వారిలో పెద్దకుమారుడైన నాయబ్ రసూల్ నిడమమనూరు మండల పరిధిలోని వేంపాడులో మైనార్టీ గురుకులంలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. లాక్‌డౌన్ కారణంగా ఇంటికి వచ్చిన రసూల్ ఆనారోగ్యం మంచానపడ్డాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. వైద్యులు బాలుడి రెండు కిడ్నీలు పాడైనట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తెలిసిన వారందరి దగ్గర అప్పు చేసి సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చు చేశారు. తర్వాత డబ్బులు లేకపోవడంతో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తీసుకువచ్చారు. కామినేని వైద్యులు బాలుడికి వారానికి మూడు సార్లు డయాలసిస్ చేస్తున్నారు. అయితే డయాలసిస్ చివరి దశలో ఉన్నప్పుడు బాలుడి ఆరోగ్యం మరింత క్షిణించింది. దీంతో తన కొడుకు పరిస్థితి చూసి తన కిడ్నీలు ఇవ్వడానికి తల్లి సిద్ధమైంది. కిడ్నీ మార్పిడి కోసం రూ. 10 లక్షలు మేరకు ఖర్చు అవుతుందని వైదులు చెప్పారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు తమ కొడుకుని కాపాడాలని ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయాలని ఆర్థించారు.

కేటీఆర్ మానవత్వం.. అంతా నేను చూసుకుంటా..
దీనిని గమనించిన ఒక నెటిజన్ ఈ విషయాన్ని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. బాలుడు రసూల్‌కు ఏమైనా సాయం అందించాలని కోరారు. దీనిపై కేటీఆర్ తన ట్విట్టర్‌లో వెంటనే స్పందించారు. ఈ సమస్యను నాకు వదిలేయండి.. నేను చూసుకుంటానని హామీ ఇచ్చారు. తదంతరం బాలుడి ఆరోగ్య పరిస్థితిని నిమ్స్ హాస్పెటల్ వైద్యులతో చర్చించి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ పూర్తిఅయ్యేలా చూడాలని అధికారలకు సూచించారు కేటీఆర్..












Click it and Unblock the Notifications