దురహంకారం: బాబు క్షమాపణ చెప్పాలన్న టీ జర్నలిస్టులు(పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రజలపై ఆధిపత్య దురహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని, తెలుగు రాష్ర్టాల ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని తెలంగాణ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ న్యూస్ ఛానల్‌పైకి అర్ధరాత్రి పోలీసులను పంపి, భావప్రకటనా స్వేచ్ఛపై నిరంకుశంగా ఉక్కుపాదం మోపేందుకు కుట్రలు పన్నారని పలువురు నిప్పులు చెరిగారు.

శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ మీడియాపై ఆంధ్రసర్కార్ పెత్తనం అంశం'పై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ఈ సమావేశానికి హజరయ్యారు. టీ న్యూస్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ సమన్వకర్తగా వ్యవహరించారు.

తొలుత టీ న్యూస్ ఛానల్ సీఈవో నారాయణరెడ్డి ఏపీ పోలీసులు తమ కార్యాలయంలో అర్ధరాత్రి అక్రమంగా నోటీసులు ఇచ్చిన విధానాన్ని వివరించారు. అనంతరం ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. ఒక రాష్ట్ర పోలీసులు మరోరాష్ట్ర చానల్‌కు నోటీసులివ్వడం దేశచర్రితలో ఇదే మొదటిదన్నారు.

టి జర్నలిస్టులు

టి జర్నలిస్టులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రజలపై ఆధిపత్య దురహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని, తెలుగు రాష్ర్టాల ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని తెలంగాణ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టి జర్నలిస్టులు

టి జర్నలిస్టులు

టీ న్యూస్ ఛానల్‌పైకి అర్ధరాత్రి పోలీసులను పంపి, భావప్రకటనా స్వేచ్ఛపై నిరంకుశంగా ఉక్కుపాదం మోపేందుకు కుట్రలు పన్నారని పలువురు నిప్పులు చెరిగారు.

టి జర్నలిస్టులు

టి జర్నలిస్టులు

శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ మీడియాపై ఆంధ్రసర్కార్ పెత్తనం అంశం'పై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.

టి జర్నలిస్టులు

టి జర్నలిస్టులు

పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ఈ సమావేశానికి హజరయ్యారు. టీ న్యూస్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ సమన్వకర్తగా వ్యవహరించారు.

చంద్రబాబునాయుడు, ఏపీ పాలకుల కుత్సిత, దుస్సాహస, ఫాసిస్టు ధోరణులకు ఈ ఘటన నిదర్శనమని మండిపడ్డారు. సీనియర్ జర్నలిస్ట్ టంకశాల అశోక్ మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు తనగొయ్యిని తానే తవ్వుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజకీయంగా చరమదశకు చేరుకున్నారని, ఆయన స్వభావంలో, నడవడికలో వచ్చిన మార్పులే ఇందుకు నిదర్శనమని టంకశాల అభిప్రాయపడ్డారు.

ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు లంచం ఇస్తూ దొరికిపోతే దొంగ అనే ముద్ర పడుతుందన్న లాజిక్‌ను కూడా మరిచిపోయారని అన్నారు. రెండు రాష్ర్టాలు విడిపోయిన తర్వాత ప్రాంతాలుగా విడిపోతాం, ప్రజలుగా కలిసి బతుకుతాం అనే నినాదానికి కట్టుబడి బతుకుతున్న తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్య మంటలు పెడుతున్న చంద్రబాబుపై కేసులు పెట్టాలని, కోర్టులలో దోషిగా నిలబెట్టాలని సీనియర్ జర్నలిస్ట్ వినయ్‌కుమార్ డిమాండ్ చేశారు.

శతృదేశం మీద దాడి చేసినట్లుగా ఏపీ సీఎం వ్యవహరిస్తున్నారని సాక్షి మేనేజింగ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి అన్నారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రవికాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయంగా దిగజారిపోయిన నాయకులు నిరంకుశంగా ఉంటారని చెప్పడానికి, ఏపీ సీఎం ఉదాహరణగా ఉంటారని అన్నారు.

ఈ కార్యక్రమంలో అడ్వకేట్ జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ తదితర సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+