అమెరికాలో కుక్క కాటు.. తెలంగాణ వ్యక్తికి రూ.15 లక్షలు పరిహారం
అమెరికాలో కుక్క కాటుకు గురైన తెలంగాణ వ్యక్తికి రూ. 15 లక్షల పరిహారం అందింది. పెంపుడు కుక్క అకారణంగా కరిచినందుకు గాను బాధితుడికి 10, 359 డాలర్లు ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో కుక్క యజమాని ఆ మొత్తాన్ని బాధితుడి అకౌంట్ కు పంపించాడు. అయితే ఈ ఘటన జరిగింది 2010లో కావడం గమనార్హం. అయితే మొదట ఆ కుక్క యజమాని పరిహారం, వైద్య ఖర్చులకు డబ్బులు ఇచ్చేందుకు నో చెప్పడంతో కోర్టు జోక్యం చేసుకుంది.
అమెరికాలో కుక్క కాటుకు గురైన తెలంగాణ వ్యక్తికి అక్కడి కోర్టు న్యాయం చేసింది. అయితే ఈ ఘటన 2010లో జరిగింది. చాలా సంవత్సరాల పాటు వాదోపవాదాల అనంతరం అక్కడి కోర్టు వైద్య ఖర్చులు, పరిహారం, వడ్డీ కలిపి 10,359 డాలర్లు బాధితుడికి ఇవ్వాలని యజమానిని ఆదేశించింది. ఉమ్మడి నల్గొండ జిల్లా చింతలపాలెం మండలం శోభనాద్రిగూడెంకు చెందిన వెలమకన్ని కిశోర్ కు 15 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత న్యాయం జరిగింది.

కిశోర్.. 2010లో ఉద్యోగం కోసం అమెరికా వెళ్లారు. అయితే రోడ్ ఐలాండ్ లో ఆయన టూ లెట్ కోసం వెతుకుతున్న క్రమంలో కార్లా అనే ఓ మహిళ ఇంట్లోకి వెళ్లగా.. ఆ ఇంట్లోని పెంపుడు కుక్క కిశోర్ పై దాడి చేసి అతడ్ని కరిచింది. అయితే ఆ సమయంలో వైద్య ఖర్చులకు 600 డాలర్లు ఇస్తానని కార్లా చెప్పింది. కానీ ఆ తర్వాత ఇవ్వకుండా మొండికేసింది. దీంతో కిశోర్ వాషింగ్టన్ డీసీలోని కోర్టును ఆశ్రయించారు.
అమెరికాలో కుక్క కాటు.. రూ.15.73 లక్షల పరిహారం https://t.co/J51leJYyz1 via @eenadulivenews pic.twitter.com/cy601thPhn
— Hi Warangal (@HiWarangal) July 4, 2025
అయితే ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కిశోర్ కు వైద్య, న్యాయ ఖర్చులు, పరిహారం, వడ్డీ కింద 10,359 డాలర్లు బాధితుడికి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అయితే అదే సమయంలో కార్లా ఐపీ పెట్టింది. ఇల్లు తనాఖా ఉండటం కారణంగా పరిహారం అందలేదు. అయితే ఇటీవల కార్లా ఇల్లు అమ్మగా కోర్టు ఆదేశాల మేరకు కొనుగోలుదారుడు ఆ పరిహారాన్ని వడ్డీతో కలిపి అందజేశాడు. మొత్తం 18,429 డాలర్లు(రూ.15.73 లక్షలు) ఇటీవల అందినట్లు కిశోర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన కెనడాలో నివాసం ఉంటున్నారు.












Click it and Unblock the Notifications